ఫేస్‌బుక్, ఇన్‌స్టా యూజ‌ర్లకు శుభ‌వార్త

Now chat on Messenger, Instagram without switching apps - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ తన యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. తన వివిధ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఏకీకృతం చేయడంలో మరో కీలక అడుగు వేసింది. తన ఫేస్‌బుక్ మెసెంజర్లో క్రాస్-ప్లాట్‌ఫాం ద్వారా కొత్త ఫీచర్ ను తాజాగా విడుదల చేసింది. ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి మెసెంజ‌ర్ కు డైరెక్టుగా మేసేజ్ చేసుకునే సౌలభ్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేయకుండా మెసెంజర్ యూజర్లతో చాట్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్ రెండూ స్వతంత్ర  యాప్స్ గా ఉన్నప్పటికీ, వినియోగదారుల ఇన్‌బాక్స్‌లు వేరుగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది.

మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ అనుభవాన్ని కనెక్ట్ చేస్తూ కొన్ని కొత్త ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్‌లోకి తీసుకువచ్చామని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి , మెసెంజర్ హెడ్ స్టాన్ చుడ్నోవిస్కీ వెల్లడించారు. దీన్ని వెంటనే అప్‌డేట్ చేయాలా వద్దా అనేది యూజర్లు నిర్ణయించుకోవచ్చని కూడా వారు పేర్కొన్నారు. అలాగే  సెల్ఫీ స్టిక్కర్లతో సహా 10 కొత్త ఫీచర్లను జత చేసినట్టు తెలిపారు. వాచ్ టుగెదర్, వానిష్ మోడ్, చాట్ కలర్స్, మనకిష్టమైన ఎమోజీలు, ఫార్వార్డింగ్, యానిమేటెడ్ మెసేజులు, అప్ డేట్ బ్లాకింగ్ తదితరాలు ఇందులో ఉన్నాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ కొత్త అప్‌డేట్ ప్రస్తుతం కొంత మందికే పరిచయం చేసింది. రాబోయే కొద్ది నెలల్లో అందరికీ అందుబాటులోకి తేనుంది. అలాగే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్  పై ఎలాంటి హామీ ఇవ్వలేదు. సో .. యూజర్లు  అప్రమత్తంగా ఉండాల్సిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top