Nokia G50: నోకియా 5జీ ఫోన్‌ వచ్చేసింది,అద్భుత‌మైన ఫీచ‌ర్లతో..

Nokia G50 Launched First 5g Phone In The G-series Check Price And Specifications - Sakshi

ఒకప్పుడు బేసిక్, ఫీచర్ మోడళ్లతో ఓ వెలుగు వెలిగిన నోకియా ఇప్పుడు 4జీ, 5జీ ఫోన్‌లతో స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ను శాసించేందుకు కొత్త కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇటీవల బండకేసి బాదినా పగలని ఎక్స్‌ఆర్‌20ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది నోకియా. ఇప్పుడు అఫార్డబుల్‌ ప్రైస్‌లో నోకియా జీ సిరీస్‌లో 5జీ ఫస్ట్‌ ఫోన్‌ని ఇండియన్‌ మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ యూకే మార్కెట్‌లో అందుబాటులో ఉండగా..మరికొద్ది రోజుల్లో ఇండియన్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. 

నోకియా జీ50 స్పెసిఫికేషన్లు 
నోకియా జీ50 ఫోన్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో విడుదల కానుంది. 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాల్ట్‌ల ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌,173.83x77.68x8.85 ఎంఎం, 6.82 అంగుళాల డిస్‌ప్లే, బ్రైట్‌నెస్‌ కోసం 450నిట్స్‌, 4 జీబీ ర్యామ్‌, క్వాల్‌కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 480ఎస్‌ఓఎస్‌,48 మెగా పిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌ తో ట్రిపుల్‌ రేర్‌ కెమెరా సెటప్‌, 5మెగా పిక్సెల్‌ ఆల్ట్రా వైడ్‌ షూటర్‌, 2మెగా పిక్సల్‌​ డెప్త్‌ సెన్సార్‌, 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. 64జీబీ ఇంట్రనల్‌ కెమెరా,512జీబీ వరకు మైక్రో ఎస్‌డీ కెమెరా,4జీ, 5జీ నెట్‌వర్క్‌లకు కనెక్టివిటీ ఆప్షన్‌, వైఫై 802.11ఏసీ,వీ5.0 బ్లూటూత్‌,జీపీఎస్‌-ఏజీపీఎస్‌ ట్రాకర్‌,ఎన్‌ఎఫ్‌సీ(Near-field communication),యూఎస్‌బీ, టైప్‌సీ పోర్ట్‌, సెన్సార్లను రిసీవ్‌ చేసుకునేందుకు యాంబీనెట్‌ లైట్‌, ఫోన్‌ ఆటో రొటేట్‌ కోసం జిరోస్కోప్‌ ఫీచర్లను యాడ్‌ చేసింది. 

ఫోన్‌ ధర
నోకియా జీ50 4జీబీ ర్యామ్‌ 64 ఇంట్రనల్‌ స్ట్రోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్‌ ధర యూకే మార్కెట్‌లో రూ.20వేలల్లో లభ్యం కానుంది. మిడ్‌నైట్‌ సన్‌, బ్లూ ఓషన్‌ కలర్స్‌లో లభ్యం కానుంది. ప్రస్తుతం ఈ 5జీ ఫోన్‌ యూకే మార్కెట్‌లో పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తుండగా.. మరోవైపు అఫార్డ్‌బుల్‌ ప్రైస్‌లో 4జీ మోడల్‌ ఫోన్‌లు నోకియా జీ10,నోకియా జీ20 ఫోన్లను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.  

చదవండి: జియోకి పోటీగా విడుదల కానున్న నోకియా బడ్జెట్‌ ఫోన్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top