Nokia C01 Plus: జియోకి పోటీగా విడుదల కానున్న నోకియా బడ్జెట్‌ ఫోన్‌

Nokia Launched Nokia C01 Plus Ultra Affordable Smartphone In India - Sakshi

ఇండియన్‌ మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌లో బేసిక్, ఫీచర్ మోడళ్లతో ఓ వెలుగు వెలిగిన నోకియా ఇప్పుడు జియోకు షాకిస్తూ 'నోకియా సీ01'పేరుతో 4జీ ఎంట్రీలెవల్‌ బడ్జెట్‌ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. చిప్‌ కొరత కారణంగా వినాయక చవితికి విడుదల కావాల్సిన జియో 4జీ స్మార్ట్‌ఫోన్‌ 'జియో నెక్ట్స్‌'ను దీపావళికి విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో జియోకి పోటీగా నోకియా బడ్జెట్‌ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. 

'నోకియా సీ01' ఫీచర్స్‌


దివాళీ ఫెస్టివల్‌ సందర్భంగా విడుదల కానున్న ఎంట్రీ లెవల్‌ బడ్జెట్‌ ఫోన్‌ నోకియా సీ01లో ఆండ్రాయిడ్‌11(గో ఎడిషన్‌) వెర్షన్‌తో అందుబాటులోకి రానుంది. తక్కువ ర్యామ్‌, యూట్యూబ్‌, జీమెయిల్‌, గూగుల్‌ వంటి లైట్‌ వెయిట్‌ యాప్స్‌ను వినియోగించేందుకు ఉపయోగపడుతుంది. ఇకఘీ ఫోన్‌ 5.45 అంగుళాల హెచ్‌డీస్క్రీన్‌, హై డైనమిక్‌ రేంజ్‌లో ఎల్‌ఈడీ ఫ్లాష్‌ వచ్చేలా రెండు 5 మెగా ఫిక్సెల్‌ కెమెరాలు, ఆక్టాకోర్‌ 1.6జీహెచ్‌జెడ్‌ యునిసోక్ SC9863A ప్రాసెసర్, 2జీబీ ర్యామ్‌, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుండగా, మైక్రో ఎస్‌డీ కార్డ్ తో స్టోరేజీని పెంచుకోవచ్చు. ఫుల్‌ ఛార్జింగ్‌ పెడితే 3000 ఎంఏహెచ్ సామర్ధ్యం ఉన్న బ్యాటరీతో ఒక రోజు వినియోగించుకోవచ్చు. 

'నోకియా సీ01' ధర, కలర్స్‌


జియోకి పోటీగా విడుదల కానున్న నోకియా సీ01 ధర ఇండియాలో రూ.5,999 ఉండగా.. 10శాతం డిస్కౌంట్‌తో మై జియో యాప్‌లో ఈ ఫోన్‌ను రూ.5,399 సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌ బ్లూ,పర్పుల్ కలర్ వేరియంట్లలో లభ్యం కానుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top