Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన!

No direction on loading Rs 2000 notes in ATMs Finance Minister - Sakshi

రూ.2వేల నోట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపడం అనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సూచనలూ ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా పార్లమెంటులో తెలియజేశారు.

ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్‌ వాచ్‌!.. ఎలాగంటే... 

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వార్షిక నివేదికల ప్రకారం.. రూ.500, రూ.2,000 నోట్ల మొత్తం విలువ 2017 మార్చి చివరి నాటికి రూ.9.512 లక్షల కోట్లు. అదే 2022 మార్చి చివరి నాటికి రూ.27.057 లక్షల కోట్లు అని ఆర్థిక మంత్రి లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపకూడదని బ్యాంకులకు ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని చెప్పారు. తమ కస్టమర్ల అవసరాలు, కాలానుగుణ ధోరణి మొదలైన వాటి ఆధారంగా బ్యాంకులు అంచనా వేసి ఏటీఎంలలో నోట్లను నింపుతాయని వివరించారు.

ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్‌ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్‌ ఇవే..

కాగా రూ.2 వేల నోట్ల సర్క్యూలేషన్ పూర్తిగా తగ్గిపోయింది. పలు కారణాల చేత ఈ నోట్ల సర్క్యూలేషన్‌ను తగ్గించేసినట్టు తెలిసింది. ఆర్బీఐ గత కొన్నేళ్లుగా కనీసం ఒక్క రూ.2000 కరెన్సీ నోటును కూడా ప్రింట్ చేయలేదు. ఏటీఎంలలో ఈ నోట్లు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2019లోనే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసినట్టు ఆర్‌బీఐ ఆ మధ్య తెలిపింది. అయితే అప్పటికే చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు ఏమయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top