
ఫిబ్రవరి 14న ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. జెరోధా సహ వ్యవస్థాపకుడు 'నిఖిల్ కామత్' (Nikhil Kamath) ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు అని చెబుతూనే.. భారతదేశం బాగుంటుందని అన్నారు. ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
భారతదేశంలోని 25 ఏళ్లలోపు తెలివైన యువ వ్యాపారవేత్తలతో.. ఒకరోజు సమయం గడిపిన తరువాత నేను ఒక ఇడియట్ అని భావిస్తున్నాను. రోజంతా అనవసరమైన మీటింగులతో కాలక్షేపం చేయడం చాలా వృధా.. ఇలాంటి యువకులతో సమయం గడిపితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ తరం నా కంటే చాలా తెలివైనదని నిఖిల్ కామత్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతే కాకుండా.. ఇది కొత్త భారతదేశం, ఇలాంటి యువకులతో భారతదేశం బాగుంటుందని, చెబుతూ.. అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు" అని ఆయన అన్నారు.
నిఖిల్ కామత్ పోస్టుపై.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. భారతదేశం అభివృద్ధి చెందడానికి ఇంకెంతో సమయం లేదని ఒకరు.. యువతతో ఎక్కువ సమయం గడపడానికి.. వారిని ప్రోత్సహించడానికి సమయం కేటాయించాలని మరొకరు కామెంట్స్ చేశారు.
ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్.. ఆలస్యమైతే డబుల్ ఛార్జ్
జెరోధా వృద్ధికి నితిన్ కామత్ తోడు
జెరోధా కంపెనీ వ్యాపార రంగంలో దూసుకెళ్తోంది. ఈ కంపెనీ అభివృద్ధి చెందటానికి.. నా సోదరుడు, జెరోధా కో-ఫౌండర్ నితిన్ కామత్ (Nithin Kamath) కూడా కారణం. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన విషయాలను నేను చూసుకుంటే.. బ్రోకింగ్ సంబంధిత పనులన్నీ కూడా నితిన్ చూసుకుంటాడు. మా మధ్య అప్పుడప్పుడు అభిప్రాయం బేధాలు వచ్చినా.. తరువాత సామరస్యంగా ముందుకు వెళ్తామని నిఖిల్ కామత్ పేర్కొన్నారు.