పేటీఎంకు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. తాజాగా ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)ను తొలగించారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తరఫున టోల్ రుసుము వసూలు చేసే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ(ఐహెచ్‌ఎంసీఎల్) ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాము తెలిపిన బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయాలని చెప్పింది.
ఐహెచ్‌ఎంసీఎల్ పేర్కొన్న జాబితా ఇదే..
- ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్
 - అలహాబాద్ బ్యాంక్
 - ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
 - యాక్సిస్ బ్యాంక్
 - బ్యాంక్ ఆఫ్ బరోడా
 - బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
 - కెనరా బ్యాంక్
 - సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
 - సిటీ యూనియన్ బ్యాంక్
 - కాస్మోస్ బ్యాంక్
 - ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
 - ఫెడరల్ బ్యాంక్
 - ఫినో పేమెంట్స్ బ్యాంక్
 - హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
 - ఐసిఐసిఐ బ్యాంక్
 - ఐడిబిఐ బ్యాంక్
 - ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్
 - ఇండియన్ బ్యాంక్
 - ఇండస్‌ఇండ్ బ్యాంక్
 - జె అండ్ కె బ్యాంక్
 - కర్ణాటక బ్యాంక్
 - కరూర్ వైశ్యా బ్యాంక్
 - కొటక్ మహీంద్రా బ్యాంక్
 - నాగ్‌పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్
 - పంజాబ్ నేషనల్ బ్యాంక్
 - సారస్వత్ బ్యాంక్
 - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
 - త్రిసూర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్
 - యుకో బ్యాంక్
 - యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
 - యెస్ బ్యాంక్
 
ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్-అప్‌లు స్వీకరించవద్దని పీపీబీఎల్‌ను ఆర్‌బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న నగదును మాత్రం గడువులోపు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనం కదులుతున్నపుడు నేరుగా టోల్ చెల్లింపులు చేయడానికి ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ పరికరం. దేశవ్యాప్తంగా 100కి పైగా రాష్ట్ర రహదారి టోల్ ప్లాజాలు సహా అన్ని జాతీయ రహదారి టోల్ ప్లాజాల్లో కలిపి 750కి పైగా టోల్‌లు పనిచేస్తున్నాయి.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
