ఎన్‌హెచ్‌ఏఐ ఒక "బంగారు గని": నితిన్ గడ్కరీ | NHAI is a gold mine for generating high-level income: Nitin Gadkari | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఏఐ ఒక "బంగారు గని": నితిన్ గడ్కరీ

Sep 19 2021 3:39 PM | Updated on Sep 19 2021 3:42 PM

NHAI is a gold mine for generating high-level income: Nitin Gadkari - Sakshi

Delhi-Mumbai Expressway Fetch ₹1500 Crore Revenues Every Month 2019లో ప్రారంభమైన ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే పనులు 2023, మార్చి నాటికి పూర్తి కానునట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు తెలిపారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే ప్రారంభమైన(2023) నాటి నుంచి

న్యూఢిల్లీ: 2019లో ప్రారంభమైన ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే పనులు 2023, మార్చి నాటికి పూర్తి కానునట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు తెలిపారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే ప్రారంభమైన(2023) నాటి నుంచి కేంద్రానికి ప్రతి నెలా ₹1,000 నుంచి ₹1500 కోట్ల విలువైన టోల్ ఆదాయం వస్తుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌హెచ్‌ఏఐని ఆదాయాన్ని ఉత్పత్తి చేసే "బంగారు గని"గా అభివర్ణించారు. నాలుగు రాష్ట్రాల గుండా వెళ్లే ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పురోగతిని తెలుసుకోవడానికి గడ్కరీ సుడిగాలి పర్యటన చేశారు. 

జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయితో పోటీ పడే విధంగా తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే  మార్చి 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు 'భారత్ మాల పరియోజన' మొదటి దశలో భాగంగా నిర్మిస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల గుండా వెళ్లే ఎనిమిది లైన్ల ఎక్స్ ప్రెస్ వే. ఈ హైవే ప్రారంభమైన తర్వాత దేశ రాజధాని, దేశ ఆర్థిక కేంద్రం మధ్య ప్రయాణ సమయం దాదాపు 24 గంటల నుండి 12 గంటలకు తగ్గనుంది.(చదవండి: ఐఫోన్‌ 13.. భారత్‌లో మరీ అంత రేట్లా?)

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ప్రస్తుత స్థాయి ₹40,000 కోట్ల నుంచి రాబోయే ఐదేళ్లలో ₹1,40,000 లక్షల కోట్ల వార్షిక టోల్ ఆదాయాన్ని వసూలు చేస్తుందని నమ్మకంగా గడ్కరీ నొక్కి చెప్పారు. ఎన్‌హెచ్‌ఏఐ ఎక్కువ రుణభారంతో సతమతం అవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నోడల్ ఏజెన్సీకి 'ఏఏఏ' రేటింగ్ లభించిందని, 'ఏఏఏ' అనేది అత్యధిక క్రెడిట్ రేటింగ్ బలమైన ఆర్థిక స్థితిని సూచిస్తుంది. 2017 మార్చిలో ₹ 74,742 కోట్ల ఉన్న మొత్తం రుణాలు ఈ ఏడాది మార్చి చివరినాటికి ₹ 3,06,704 కోట్లకు పెరిగాయని ఇటీవల మంత్రి రాజ్యసభకు తెలియజేశారు. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు ఉపాధిని సృష్టిస్తాయని మరియు దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయనీ పేర్కొన్న గడ్కరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement