కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్.. మరిన్ని కొత్త హంగులతో: భారత్‌కి వస్తుందా?

New kia carnival facelift road testing start - Sakshi

భారతదేశంలో 7 సీటర్ విభాగంలో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన 'కియా కార్నివాల్' త్వరలోనే మరిన్ని కొత్త హంగులతో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే నాల్గవ తరం కియా కార్నివాల్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది.

నాల్గవ తరం కియా కార్నివాల్ ఇండియన్ మార్కెట్లో ప్రారంభం కాలేదు, అయితే ప్రస్తుతం సౌత్ కొరియాలో టెస్టింగ్ దశలో ఉంది. ఈ లేటెస్ట్ కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ దాని మునుపటి మోడల్ కంటే కొత్త డిజైన్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ వంటి వాటిని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

డిజైన్ & ఫీచర్స్:
కొత్త కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త కియా ఈవి9 మాదిరిగా ఉంటుంది. కావున వర్టికల్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ కలిగి రీడిజైన్ బోనెట్ పొందుతుంది. అల్లాయ్ వీల్స్ దాదాపు మారే అవకాశం లేదు. రియర్ ఫ్రొఫైల్‌లో టెయిల్ లాంప్ కొత్తగా ఉంది. కారు పూర్తిగా కప్పబడి ఉండటం వల్ల మొత్తం డిజైన్ వెల్లడి కాలేదు.

నాల్గవ తరం కియా కార్నివాల్ డిజైన్ కొంత వరకు వెల్లడైంది, కానీ ఫీచర్స్ గురించి ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు, రానున్న రోజుల్లో కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్స్ వెల్లడవవుతాయి.

(ఇదీ చదవండి: గ్రేట్ ఆఫర్: రూ. 22,999కే ఐఫోన్ సొంతం చేసుకోండి: కానీ..!)

పవర్‌ట్రెయిన్‌ ఆప్సన్స్:
కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్‌ పవర్‌ట్రెయిన్‌ ఆప్సన్స్ గురించి అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే లేటెస్ట్ కార్నివాల్ ఎలక్ట్రిక్ మోటారుతో జత చేసిన 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ పొందనుంది. ప్రస్తుతం ఈ ఎంపివి 2.2 లీటర్ డీజిల్, 3.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్సన్స్ కలిగి ఉంది.

(ఇదీ చదవండి: Nokia C99: నోకియా నుంచి సరికొత్త మొబైల్: ప్రత్యర్థులకు చుక్కలే..)

లాంచ్ టైమ్:
కియా కార్నివాల్‌ను కంపెనీ ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో KA4 ఎంపివిగా ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది చివరి నాటికి దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది, అదే సమయంలో కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ 2024 జనవరి నాటికి గ్లోబల్ మార్కెట్లో విడుదలవుతుందని భావిస్తున్నారు.

అంచనా ధర:
కియా మోటార్స్ భారతీయ మార్కెట్లో కార్నివాల్‌ ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్ చేస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ ఏడాది విడుదలకానున్న కియా కేఏ4 ధర రూ. 50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవవుతాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top