ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి వస్తున్న నోకియా సీ99 - పూర్తి వివరాలు

Nokia c99 smartphone details - Sakshi

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలతో ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతున్నాయి. ఇలాంటి వాటినే వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాగా ఇప్పుడు నోకియా కంపెనీ ఒక లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

శామ్‌సంగ్, వన్‌ప్లస్, రియల్‌మీ మొదలైన వాటికి గట్టి పోటీ ఇవ్వడానికి నోకియా సీ99 స్మార్ట్‌ఫోన్ విడుదలకానుంది. బార్సిలోనాలో జరిగిన ఏండబ్ల్యుసి 2023 ఈవెంట్‌లో 'నోకియా సీ99' అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఈ మొబైల్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వంటివి ఒక్కొక్కటిగా లీక్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ మొబైల్ మార్కెట్లో ఎప్పుడు అధికారికంగా విడుదలవుతుందనే విషయం వెల్లడి కాలేదు.

నోకియా సీ99 ధరలు కూడా కంపెనీ వెల్లడించలేదు, కానీ దీని ధర సుమారు 480 డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 36,000 కంటే ఎక్కువే. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ డిస్‌ప్లే, లేటెస్ట్ హై ఎండ్ చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 144 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 180డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్‌ వంటివి పొందుతుంది.

(ఇదీ చదవండి: గ్రేట్ ఆఫర్: రూ. 22,999కే ఐఫోన్ సొంతం చేసుకోండి: కానీ..!)

కొత్త నోకియా సీ99 స్మార్ట్‌ఫోన్‌లోని స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ గరిష్టంగా 16GB RAMతో జత చేయవచ్చు. ఈ సరికొత్త మొబైల్ గురించి తెలియాల్సిన వివరాలు చాలానే ఉన్నాయి. కాగా ఇది దేశీయ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందనేది త్వరలో తెలుస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top