గ్రేట్ ఆఫర్: రూ. 22,999కే ఐఫోన్ సొంతం చేసుకోండి: కానీ..!

Apple iphone mini 12 selling for rs 22999 on flipkart - Sakshi

ఇటీవల కాలంలో ఆపిల్ ఐఫోన్‌ను ఉపయోగించడానికి దాదాపు అందరూ ఆసక్తి చూపుతారు. అయితే ధర ఎక్కువగా ఉన్న కారణంగా చాలామంది కొనుగోలు చేయలేకపోతారు. అయితే అలాంటి వారికోసం కంపెనీ ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది.

ఇప్పుడు యాపిల్ మొబైల్ కొనాలనుకునే వినియోగదారులు రూ. 22,999 చెల్లించి ఫ్లిప్‌కార్ట్‌లో 'ఐఫోన్ 12 మినీ' కొనుగోలు చేయవచ్చు. నిజానికి ఈ మొబైల్ ధర రూ. 59,900. క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 10,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కావున రూ. 49,999కే లభిస్తుంది. అదే సమయంలో ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 27,000 తగ్గుతుంది.

ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే మొబైల్ బ్రాండ్, స్థితి వంటి వాటిమీద ఆధారపడి ఉంటుంది. కొనుగోలుదారులు తప్పకుండా ఈ విషయాన్ని గమనించాలి. కంపెనీ తెలిపిన అన్ని షరతులను మీరు పాటిస్తే రూ. 22,999తో యాపిల్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.

(ఇదీ చదవండి: Volkswagen ID.2all EV: ఫోక్స్‌వ్యాగన్ నుంచి రానున్న మొదటి ఎలక్ట్రిక్ కారు, ఇదే)

ఆపిల్ ఐఫోన్ 12 మినీ 5.4 ఇంచెస్ సూపర్ రెటీనా XDE డిస్‌ప్లే కలిగి, IP68 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌ పొందుతుంది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోన్ A 14 బయోనిక్ చిప్‌సెట్, 64 GB ఇంటర్నల్ మెమరీ వంటివి పొందుతుంది. కంపెనీ ఈ మొబైల్ మీద ఆరు నుంచి ఏడు సంవత్సరాల సెక్యూరిటీ, ఇతర అప్‌డేట్‌లను అందిస్తుంది.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top