ఊహించని షాక్‌.. నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ, వణుకుతున్న ఐటీ ఉద్యోగులు!

New Delhi: Income Tax Department Sending Notice To Moonlighting Employees - Sakshi

మూన్‌ లైటింగ్‌.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. కరోనా లాక్‌డౌన్‌ టైంలో కొందరు ఉద్యోగులు ఒకేసారి రెండు జాబ్‌లు చేస్తూ అధిక అదాయాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇటీవల ఈ బండారం బయటపడడంతో ఐటీ రంగాన్ని ఈ అంశం కుదిపేసిన సంగతి తెలిసిందే. తాజాగా మూన్‌లైటింగ్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సారి ఐటీ శాఖ దీనిపై ఫోకస్‌ పెట్టింది. అసలు ఏం జరుగుతోందంటే..


ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న ఉద్యోగుల్లో కొందరు మూన్‌లైటింగ్‌ ద్వారా అధికంగా సంపాదించిన.. తమ ఆదాయాన్ని ఐటీ రిటర్నుల్లో చూపించలేదు. దీంతో ఆయా ఉద్యోగులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతానికి 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాల ఆదాయాలకు సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. మూన్‌లైటింగ్ ద్వారా సంపాదిస్తున్న వారిలో ఎక్కువ మంది ఐటీ సెక్టార్, అకౌంటింగ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ వున్నారని పేర్కొంది.


వీరిలో విదేశాల నుంచి నగదు బదిలీ అయిన వారు చాలా మంది ఉన్నారు, అయితే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు, వారు తమ సాధారణ జీతంపై మాత్రమే పన్ను చెల్లించారు. ఈ క్రమంలో మూన్ లైటింగ్ సంపాదనపై పన్ను చెల్లించని దాదాపు మందికి పైగా ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

విశేషమేమిటంటే.. మూన్ లైటింగ్ ద్వారా సంపాదిస్తున్న చాలా మంది ఉద్యోగుల సమాచారాన్ని వారు పనిచేస్తున్న కంపెనీలే ఆదాయపు పన్ను శాఖకు అందజేశాయి.  ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ లావాదేవీలను ట్రాక్ చేయడం ద్వారా ఐటీ శాఖ అలాంటి వారిని తేలిగ్గా గుర్తించింది. కరోనా కాలంలో మూన్‌లైటింగ్ చేసే వారి సంఖ్య పెరిగిన సంగతి తెలిసింది. మరో వైపు ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీన్ని సమర్థించగా.. మరికొందరు మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించారు.

చదవండి:  Business Idea: ఒక్కసారి ఈ పంట పండించారంటే ప్రతి ఏటా రూ.60 లక్షల ఆదాయం! బ్లూబెర్రీ సాగుతో లాభాలే.. లాభాలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top