సింటెక్స్‌ మాజీ ఎండీకి ఎన్‌సీఎల్‌ఏటీలో ఎదురుదెబ్బ

NCLAT dismisses ex-Sintex Industries CMD Rahul Patel s plea on insolvency - Sakshi

దివాలా ప్రక్రియను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ దివాలా ప్రక్రియకు వ్యతిరేకంగా సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ మాజీ చైర్మన్, ఎండీ రాహుల్‌ అరుణ్‌ప్రసాద్‌ పటేల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) కొట్టివేసింది. సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌పై కార్పొరేట్‌ దివాలా ప్రక్రియ(సీఐఆర్‌పీ)ను ఆమోదిస్తూ,  2021 ఏప్రిల్‌ 6న ఎన్‌సీఎల్‌టీ అహ్మదాబాద్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును ఇద్దరు సభ్యుల ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్‌ తాజాగా సమర్థించింది. ఇన్వెస్కో అసెట్‌ మేనేజ్‌మెంట్‌(ఇండియా) అభ్యర్థనకు అనుగుణంగా అహ్మదాబాద్‌ బెంచ్‌ గతంలో సింటెక్స్‌పై ఐసీఆర్‌పీకి ఆదేశాలు జారీ చేసింది.

ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్‌ అరుణ్‌ప్రసాద్‌ పెట్టుకున్న అభ్యర్ధనలో ఎలాంటి మెరిట్‌ కనిపించలేదని బెంచ్‌ పేర్కొంది. దీంతో మధ్యంతర అప్పీల్‌ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా.. సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌పై సీఐఆర్‌పీ దాదాపు పూర్తికానుంది. డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్, అసెట్స్‌ కేర్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఎంటర్‌ప్రైజ్‌ సంయుక్తంగా వేసిన బిడ్‌కు 98.88 శాతం వోటింగ్‌ లభించింది. వెరసి 2023 ఫిబ్రవరి 10న ఎన్‌సీఎల్‌టీ రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top