breaking news
Arunprasad
-
సింటెక్స్ మాజీ ఎండీకి ఎన్సీఎల్ఏటీలో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: కార్పొరేట్ దివాలా ప్రక్రియకు వ్యతిరేకంగా సింటెక్స్ ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్, ఎండీ రాహుల్ అరుణ్‌ప్రసాద్ పటేల్ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కొట్టివేసింది. సింటెక్స్ ఇండస్ట్రీస్‌పై కార్పొరేట్ దివాలా ప్రక్రియ(సీఐఆర్‌పీ)ను ఆమోదిస్తూ, 2021 ఏప్రిల్ 6న ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్ఏటీ బెంచ్ తాజాగా సమర్థించింది. ఇన్వెస్కో అసెట్ మేనేజ్మెంట్(ఇండియా) అభ్యర్థనకు అనుగుణంగా అహ్మదాబాద్ బెంచ్ గతంలో సింటెక్స్‌పై ఐసీఆర్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ అరుణ్‌ప్రసాద్ పెట్టుకున్న అభ్యర్ధనలో ఎలాంటి మెరిట్ కనిపించలేదని బెంచ్ పేర్కొంది. దీంతో మధ్యంతర అప్పీల్‌ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా.. సింటెక్స్ ఇండస్ట్రీస్‌పై సీఐఆర్‌పీ దాదాపు పూర్తికానుంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, అసెట్స్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ సంయుక్తంగా వేసిన బిడ్‌కు 98.88 శాతం వోటింగ్ లభించింది. వెరసి 2023 ఫిబ్రవరి 10న ఎన్సీఎల్టీ రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదించింది. -
నమ్మితే అంతే!
సాక్షి, కడప: అరుణ్‌ప్రసాద్ సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఓ ప్రముఖ కంపెనీ నిర్వహించిన లక్కీడ్రాలో రూ. 70వేలు తగిలిందని, ట్యాక్స్ రూపంలో రూ. 8వేలు డిపాజిట్ చేస్తే మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని అందులో ఉంటుంది. లక్కీడ్రా...70వేల రూపాయలు...ఆశతో రూ. 8వేలు అరుణ్‌ప్రసాద్ ఓ ఖాతాలో జమ చేశాడు. నెలలు గడుస్తున్నాయి.. ఇప్పటి వరకూ రూ. 70వేలు ఊసేలేదు. ఇది ఇప్పటి వరకూ జరుగుతూ వస్తున్న సెల్ మోసాలు. తాజాగా వారం రోజుల కిందట లక్ష్మిరెడ్డి మోపూరి అనే ఎన్ఆర్ఐ ఈ మెయిల్‌కు ఓ లెటరు వచ్చింది. 2009-12 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి లక్ష్మిరెడ్డి ఖాతాలో రూ. 5లక్షలు జమ కావాల్సి ఉందని, రూ. 12,362 చెల్లిస్తే మొత్తం సొమ్మును బ్యాంక్‌ఖాతాలో జమ చేసేందుకు ఆర్బీఐ గవర్నర్ రాజన్ నిర్ణయం తీసుకున్నట్లు ఓ లెటర్ వచ్చింది. దీంతో లెటర్లో ఉన్న మెయిల్‌కు లక్ష్మిరెడ్డి రూ. 12,362 చెల్లించారు. అయితే ఇప్పటి వరకూ రూ. 5లక్షల ఊసే లేదు. తాజాగా జరుగుతున్న ఆన్లైన్ మోసాలకు ఇదొక ఉదాహరణ. ఆన్లైన్ మోసాలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. లక్కీడ్రా తగిలిందని, ఫలానా అడ్రస్‌కు రావాలని చెప్పడం, అక్కడకు పోతే వారి కంపెనీకి సంబంధించిన ఇన్సూరెన్స్ వివరాలపై గంటపాటు కౌన్సెలింగ్ ఇచ్చి బిజినెస్ చేసుకోవడం కడప, ప్రొద్దుటూరులో జరుగుతోంది. అలాగే లక్కీడ్రాలో డబ్బులు తగిలినట్లు మెసేజ్‌లు రావడం, బాధితులు మోసపోయిన సంఘటనలు ఇటీవల బోలెడు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలు, లక్కీడ్రాల గురించి అవగాహన లేనివాళ్లు మోసపోవడం సహజం. అయితే నిత్యం ఫారిన్ కరెన్సీ ట్రాన్స్ఫర్లు చేస్తూ, సైబర్ నేరాలపై పూర్తి అవగాహన ఉండే ఎన్ఆర్ఐలే మోసపోతుంటే.., మోసం చేసేవాళ్లు పక్కాగా ఎలా నమ్మించి నట్టేట ముంచుతున్నారో ఇట్టే తెలుస్తుంది. ఆర్బీఐ పేరుతో దగా: ఇటీవల ఓ ఎన్ఆర్ఐ ఈ మెయిల్‌కు ఓ లెటరు వచ్చింది. అలాంటి ఇలాంటి లెటరు కాదు. ఏకంగా ఆర్బీఐ లోగో ఉన్న లెటర్ ప్యాడ్. ఆర్బీఐ అడ్రస్. ఆర్బీఐ కోఆర్డినేటర్ పేరు, రిజిస్ట్రేషన్ కోడ్ చూస్తే నిజంగా ఆర్బీఐ నుంచి లెటర్ వచ్చిందని ఎవరైనా నమ్మాల్సిందే! డీసీఎం(డిపార్ట్మెంట్ ఆఫ్ కరెన్సీ మేనేజ్మెంట్) సన్సద్బాద్ మార్గ్, న్యూఢిల్లీ అడ్రస్‌తో, ఆర్బీఐ ఫారిన్ఫండ్స్ ట్రాన్స్ఫర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ ఏంజిలినా డిసౌజా పేరుతో లెటరు వచ్చింది. దాని సారాంశం ఇలా ఉంది. ‘2009 నుంచి 2012 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆర్బీఐ ఖాతాదారుల జాబితా ఫైలును సమీక్షించారు.. లాటరీ, అన్‌పెయిడ్, అన్ డెలివరీ ఫండ్స్, పేమెంట్స్ ఫైలు(ఫైల్ నెంబర్:ఆర్బీఐ/ఐడీ1033/09)ను పరిశీలిచించారు.. అందులో మీకు రూ. 5లక్షలు ఆర్బీఐ చెల్లించాల్సి ఉంది. దీనికి సంబధించి 2013 జనవరి 2న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, సెనెట్ట్యాక్స్ ఆర్థిక వ్యవహారాల కమిటీతో ముంబయి బ్రాంచ్‌లో సమావేశమయ్యారు.. ఇప్పటి వరకూ ఆర్బీఐ నుంచి చెల్లించాల్సిన దీర్ఘకాలిక పెండింగ్ మొత్తాలను వారివారి ఖాతాల్లోకి జమ చేయాలని రాజన్ నిర్ణయం తీసుకున్నారు.. అయితే ఆ మొత్తాలను సంబంధించిన ట్యాక్స్‌ను మాత్రం ఖాతాదారులే చెల్లించాలి.. ఈ ట్యాక్స్‌ను రెండువారాల్లోపు చెల్లించి డబ్బు అందిందా లేదా? అనేది ఆర్బీఐ అధికారులతో నిర్ధారించుకోవాలి. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ౌజ్ఛీ.2టఛజీఃౌఠౌౌ్టజు.ఛిౌఝను సంప్రదించాలి.. ఇలా చెల్లించకపోతే మీకు రావాల్సిన రూ. 5లక్షల చెల్లింపులు నిలిచిపోతాయి.. దీనికి పూర్తి బాధ్యత మీరే వహించాలి.. ఆర్బీఐకి ఎలాంటి సంబంధం ఉండదు.’’ అని ఉంది. ఈ మొత్తం లెటరు ఆర్బీఐ ఫారిన్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ మేడమ్ ఏంజిలినా డిసౌజా పేరుతో వచ్చింది. ఇంత పక్కాగా లెటర్ వచ్చిన తర్వాత ఎవరైనా ట్యాక్స్ మొత్తాన్ని చెల్లించాలనుకుంటారు. డబ్బు చెల్లించిన తర్వాత ఎలాంటి మొత్తం బాధితుల ఖాతాల్లో జమ కాదు. ఇలాంటి మోసాలు ఇటీవల అధికంగా జరుగుతున్నాయి. సెల్ఫోన్లు, ఈ మెయిల్స్కువచ్చే మెసేజ్‌లు, లెటర్లతో అవి నిజమోకావో తెలుసుకోకుండా భారీగా డబ్బు వస్తుందనే ఆశతో చాలామంది కొద్దిమొత్తాన్ని చెల్లించి బలవుతున్నారు. ఇలాంటి సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండి, మెసేజ్‌లు వచ్చిన వెంటనే పోలీసులను సంప్రదించి డబ్బులు చెల్లించాల్సిన ఖాతా నెంబర్లు, అడ్రస్‌లపై బాధితులు ఫిర్యాదు చేయాలి. అప్పుడే వాస్తవంగా డబ్బు వస్తుందా.. లేక మోసమా.. అనేది తేలుతుంది.