పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్‌.. ప్రభుత్వ బంకుల్లో కన్నా తక్కువ ధర

Nayara Energy sells petrol diesel at Re 1 less than PSUs - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) బంకుల కన్నా చౌకగా ప్రైవేట్‌ కంపెనీలు ఇంధనాలను విక్రయిస్తున్నాయి. జియో–బీపీ తర్వాత తాజాగా నయారా ఎనర్జీ ఈ జాబితాలోకి చేరింది. పీఎస్‌యూ బంకులతో పోలిస్తే రూ. 1 తక్కువకే తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ను విక్రయిస్తున్నట్లు వివరించింది.

మహారాష్ట్ర, రాజస్థాన్‌ వంటి 10 రాష్ట్రాల్లో డిస్కౌంటు రేట్లకు విక్రయాలను జూన్‌ ఆఖరు వరకు కొనసాగించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా మొత్తం 86,925 పైచిలుకు పెట్రోల్‌ బంకులు ఉండగా..  నయారా ఎనర్జీకి 6,376 బంకులు (7 శాతం పైగా వాటా) ఉంది. జియో–బీపీ (రిలయన్స్‌–బీపీ జాయింట్‌ వెంచర్‌ సంస్థ) తమ బంకుల్లో ప్రస్తుతం డీజిల్‌ను మాత్రమే పీఎస్‌యూ బంకుల కన్నా తక్కువకు విక్రయిస్తోంది.

ఇటీవల అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినప్పటికీ పీఎస్‌యూలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ మాత్రం రేట్లను సవరించకుండా యథాప్రకారం కొనసాగిస్తున్నాయి. అయితే, జియో–బీపీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్‌ సంస్థలు మాత్రం ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకే డిస్కౌంటుకు విక్రయిస్తున్నట్లు తెలిపాయి.

ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్‌.. అన్నింటి కంటే తక్కువ ధరకే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top