
Jio-bp premium diesel: ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్‌ను నడుపుతున్న భారతీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రాష్ట్ర ఇంధన హోల్‌సేలర్ల కంటే తక్కువ ధరకే డీజిల్‌ను విక్రయిస్తోంది.
ఇదీ చదవండి: SEBI on Adani: అదానీ గ్రూప్‌పై సెబీ కీలక వివరణ! సుప్రీం కోర్టుకు రిజాయిండర్ అఫిడవిట్
జియో-బీపీ (Jio-bp) ప్రీమియం డీజిల్‌ను తాజాగా ప్రారంభించింది. జియో-బీపీ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యూకేకి చెందిన బీపీ అనే ఇంధన సంస్థల జాయింట్ రిటైలింగ్ వెంచర్. జియో-బీపీ ప్రారంభించిన ఈ ప్రీమియం డీజిల్ ధర ఇతర ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు విక్రయస్తున్న సాధారణ డీజిల్ కంటే తక్కువగా ఉంది. భారతీయ వినియోగదారుల కోసం డీజిల్ ప్రమాణాలను పెంచడానికి యాక్టివ్ టెక్నాలజీతో కూడిన డీజిల్‌ను విడుదల చేస్తున్నట్లు జియో-బీపీ ప్రకటించింది.
భారీగా ఇంధన ఆదా
కొత్తగా లాంచ్ చేసిన డీజిల్ కంపెనీ నెట్‌వర్క్ పరిధిలోని అన్ని అవుట్‌లెట్‌లలోనూ అందుబాటులో ఉంటుందని, 4.3 శాతం మెరుగైన ఇంధన వ్యవస్థ కారణంగా ట్రక్కుల యజమానులకు ఒక్కో వాహనంపై సంవత్సరానికి రూ. 1.1 లక్షల వరకు ఆదా అవుతుందని జియో-బీపీ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలోని జియో-బీపీ అవుట్‌లెట్‌లో కొత్త ప్రీమియం డీజిల్‌ను లీటర్‌కు రూ. 91.30కి విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడ ఇతర ప్రభుత్వ రంగ పెట్రోల్ పంపుల వద్ద సాధారణ డీజిల్ ధర రూ. 92.28 ఉంది.
ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్‌కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే!