మింత్రా ధమాకా సేల్‌: టాప్‌ బ్రాండ్స్‌పై 80 శాతం డిస్కౌంట్‌ 

Myntra Big Fashion Festival Sale 2022 starts tomorrow up to 80 pc off - Sakshi

సాక్షి,ముంబై: ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ రీటైలర్‌ మింత్రా కూడా ఫెస్టివ్‌ సేల్‌ను ప్రారంభిస్తోంది. బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్ 2022 డిస్కౌంట్‌సేల్‌ రేపు (సెప్టెంబరు 23 నుంచి)  షురూ కానుంది.  ఈ సందర్భంగా టాప్‌  బ్రాండ్స్‌పై 80 శాతం దాకా తగ్గింపు అందించనుంది. ముఖ్యంగా హెచ్‌ అండ్‌ ఎం, లిబాస్‌, రెడ్‌ టేప్‌,గినీ అండ్‌ జాయ్‌, మస్త్‌ అండ్‌ హార్బర్‌ ప్యూమా, నైక్‌ ఉత్పత్తులపై గొప్ప తగ్గింపును అందిస్తోంది.

సెప్టెంబరు 23 నుంచి పలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రిటైలర్లు సంస్థల్లో పండుగ సీజన్ సేల్‌కు తెర తీయనున్నసంగతి తెలిసిందే. ఎందుకంటే కోవిడ్‌ తర్వాత ఈ సంవత్సరం అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని రిటైలర్లు భావిస్తున్నారు.  అందుకే డిస్కౌంట్‌, డీల్స్‌ అంటూ కస్టమర్లను ఊరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్‌ సేల్‌ను లాంచ్‌ చేయనుంది.  తద్వారా  60 లక్షల ప్రత్యేక కస్టమర్లను ఆకర్షించాలని భావిస్తోంది. మింత్రా  బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ గ్రాండ్ ఓపెనింగ్ అర్ధరాత్రి 2 గంటలకు ప్రారంభమవుతుంది. 
 
కస్టమర్లకు 6వేలకు పైగా  బ్రాండ్‌లను అందుబాటులో ఉంచుతోంది.  మహిళలు, పురుషులు, పిల్లలు, ప్లస్ సైజ్‌ దుస్తులపై భారీ డీల్స్‌ అందిస్తోంది. అలాగే ప్యూమా కిడ్స్ వేర్‌పై కనీసం 60 శాతం తగ్గింపును అందిస్తోంది. ప్యూమా, నైక్ స్పోర్ట్స్ షూస్, క్యాజువల్ షూలను 50శాతం వరకు తగ్గింపుతో అందిస్తోంది. ఇంకా MAC, Lakme, Maybelline ఉత్పత్తులపై 15-40శాతం డిస్కౌంట్‌ లభ్యం. ఇంకా రెడ్ టేప్ షూస్‌పై 80 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top