ఓటేసిన అంబానీ దంపతుల విన్నపం ఇదే.. | Sakshi
Sakshi News home page

ఓటేసిన అంబానీ దంపతుల విన్నపం ఇదే..

Published Mon, May 20 2024 6:58 PM

Mukesh Ambani Nita Ambani Cast Their Vote Urges Citizen Participation

ముంబై: లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో సెలబ్రిటీలు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, వారి కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి సోమవారం ముంబైలోని మలబార్ హిల్‌కి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసిన అనంతరం రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు కీలక పాత్రను నొక్కిచెప్పారు. ‘దేశ పౌరులుగా ఓటు వేయడం చాలా ముఖ్యం. ఓటు వేయడం మన హక్కు, బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను" అని ఆమె వ్యాఖ్యానించారు. ముఖేష్ అంబానీ ఇవే భావాలను వ్యక్తీకరించారు. "ప్రతి భారతీయుడు ఓటు వేయాలి. ఇది నాతోటి ప్రజలకు నా విజ్ఞప్తి" అని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 49 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 695 మంది అభ్యర్థుల పోటీలో ఉన్నారు. వీరిలో రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీయూష్ గోయల్, ఉజ్వల్ నికమ్, చిరాగ్ పాశ్వాన్, ఒమర్ అబ్దుల్లా వంటి ప్రముఖలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement