MRF founder Mammen Mappillai's success story; Who sold balloons, slept on floor - Sakshi
Sakshi News home page

MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్‌ఎఫ్‌ సక్సెస్‌ జర్నీ

Published Tue, Jun 13 2023 5:53 PM

MRF founder Mammen Mappilla successstory sold balloons slept on floor - Sakshi

భారతీయ స్టాక్‌మార్కెట్‌ చరిత్రలో ఆటోమొబైల్ టైర్ మేజర్ ఎంఆర్‌ఎఫ్‌  స్టాక్‌ మరో సారి తన ప్రత్యేకతను చాటుకుంది, టైర్ పరిశ్రమలో అగ్రస్థానంలోఉన్న  ఎంఆర్‌ఎఫ్‌ షేరు (జూన్‌ 13, 2023)న తొలిసారి లక్ష మార్క్‌ను టచ్‌ చేసింది. ఈ ఏడాది 45 శాతానికి పైగా ఎగిసి భారతదేశపు అత్యంత ఖరీదైన స్టాక్‌గా రికార్డు క్రియేట్‌ చేసింది.  అసలు ఎంఆర్ఎఫ్‌ కంపెనీ ఫౌండర్‌  ఎవరు?  ఈ కంపెనీ విజయ ప్రస్థానం ఏమిటి? ఒకసారి చూద్దాం. 

ఎంఆర్‌ఎఫ్‌ అంటే  మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. దేశంలోని అతిపెద్ద టైర్ కంపెని  ఫౌండర్‌  కేఎం మామ్మెన్ మాప్పిళ్లై . ఆయన అంకితభావం, కృషి  పట్టదలతో ఈ రోజు  ఈ స్థాయికి ఎగిసింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, 1946 సంవత్సరంలో,  కేఎం మమ్మెన్ మాప్పిళ్ళై మద్రాసు వీధుల్లో బెలూన్లు అమ్ముతూ కుటుంబానికి అండగా నిలిచారు.తొమ్మిది మంది తోబుట్టువులతో, కేరళలో సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన మమ్మన్‌కు ఈ  బెలూన్ల వ్యాపారమే తన విజయానికి సోపానమని ఊహించి ఉండరు. (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్‌ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?)

మామెన్ తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు. అయితే మామెన్‌ మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్న సమయంలోస్వాతంత్ర్య పోరాటంలో  తండ్రిని రెండేళ్లపాటు జైలులో ఉంచారు. 1946లో మామెన్ చిన్న తయారీ యూనిట్‌లో బొమ్మల బెలూన్‌లను తయారీతో పారిశ్రామిక జీవితాన్ని షురు చేశారు. ఇది సుమారు 6 సంవత్సరాల పాటు కొనసాగింది. 1952లో టైర్ రీట్రేడింగ్ ప్లాంట్‌కు ఒక విదేశీ కంపెనీ ట్రెడ్ రబ్బర్ సరఫరా చేస్తోందని గమనించడంతో ఆయన జీవితం  మలుపు తిరిగింది.  అలా  రబ్బరు వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.  (నెలకు లక్షన్నర జీతం: యాపిల్‌ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్‌ ట్వీట్‌)

గ్లోబల్‌ కంపెనీలు అవుట్‌
తర్వాత మద్రాసులోని చీటా స్ట్రీట్‌లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించారు. 1956 నాటికి రబ్బరు వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకుంది. నాలుగేళ్లలో మార్కెట్ వాటా 50 శాతానికి చేరుకుంది.  పలితంగా అనేక అంతర్జాతీయ కంపెనీలు భారత మర్కెట్‌నుంచి తప్పుకున్నాయి.  అయితే  మామెన్ ఇక్కడితో ఆగలేదు టైర్ల తయారీ వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. దీంతో  రబ్బరు ఉత్పత్తులనుంచి  టైర్ పరిశ్రమలోకి మారారు. 1960లో రబ్బర్, టైర్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. అలా అమెరికాకు చెందిన మాన్స్‌ఫీల్డ్ టైర్, రబ్బర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని  మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (ఎంఆర్‌ఎఫ్‌)గా  ఆవిష్కరించింది. ట్రెడ్స్, ట్యూబ్‌లు, పెయింట్స్, బెల్ట్‌లు, బొమ్మలు వంటి అనేక ఇతర ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. 1961లో మద్రాస్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో  లిస్ట్‌ అయింది.

అమెరికాకు రబ్బరు ఉత్పత్తులను ఎగుమతి చేసిన ఘనత
1967లో కంపెనీ అమెరికాకు టైర్లను ఎగుమతి చేసిన భారతదేశంలో మొట్టమొదటి కంపెనీగా అవతరించింది. భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో వివిధ ప్లాంట్‌లను ప్రారంభించింది. 1973 సంవత్సరంలో దేశంలో నైలాన్ ట్రావెల్ కారును వాణిజ్యపరంగా తయారు చేసి మార్కెట్ చేసిన తొలి కంపెనీగా అవతరించింది. అలా 1979 నాటికి కంపెనీ పేరు కంపెనీ పేరు విదేశాలకు ఎగబాకింది. ఆ తరువాత అమెరికన్ కంపెనీ మాన్స్‌ఫీల్డ్ సంస్థలో తన వాటాను విక్రయించడంతో ఎంఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌గా మారింది.  

ఇండియన్ రోడ్లకు సరిపోయే టైర్లు తయారు 
అంతా బాగానే ఉంది కానీ మాన్స్‌ఫీల్డ్ టెక్నాలజీ భారతీయ రహదారి పరిస్థితులకు తగినది కాదని మామెన్ గ్రహించాడు. మరోవైపు డన్‌లప్, ఫైర్‌స్టోన్,గుడ్‌ఇయర్ వంటి బహుళజాతి కంపెనీల ఆధిపత్యంతో నిలదొక్కుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సొంతంగా,భారతీయ రోడ్లకు అనుగుణం టైర్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టిన మామెన్‌ ప్రభుత్వ  సాయంతో  1963లో తిరువొత్తియూర్‌లోని రబ్బరు పరిశోధనా కేంద్రం తిరువొత్తియూర్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. 

మార్కెటింగ్‌పై దృష్టి, ఐకానిక్‌ మజిల్‌మేన్‌ ఆవిష్కారం
అంతేకాదు  మార్కెటింగ్‌పై దృష్టి పెట్టారు.  అనేక పరిశోధనల తర్వాత, ధృఢమైన మన్నికైన టైర్లకు ప్రతిరూపంగా  అలిక్ పదమ్సీ  ఐకానిక్‌  పవర్‌ఫుల్‌ ఎంఆర్‌ఎఫ్‌ మజిల్‌ మేన్‌  చిత్రం వచ్చింది. భారతీయ ప్రకటనల ముఖచిత్రాన్ని మార్చివేసి 1964లో మజిల్‌మేన్‌  జనాన్ని విపరీతంగా ఆకర్షించింది. టీవీ వాణిజ్య ప్రకటనలు, బిల్‌బోర్డ్‌లలో ఇలా ఎక్కడ చూసినా ఈ పిక్‌ దర్శనమిచ్చింది.

వివిధ ట్రక్ డ్రైవర్ల సర్వే చేసి మరీ పదంశీ దీన్ని రూపొందించారు. అందుఆయనను రాక్‌స్టార్ లేదా గాడ్ ఆఫ్ మార్కెటింగ్ అని పిలుస్తారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతినార్జించింది ఎంఆర్‌ఎఫ్‌. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా మొదలు విరాట్ కోహ్లీ వరకు పలువురు సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు.  80 ఏళ్ల వయసులో 2003లో మాప్పిళ్ళై కన్నుమూశారు. అనంతరం అతని కుమారులు వ్యాపారాన్ని చేపట్టారు.

1992లో మాప్పిళ్లై పరిశ్రమకు చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డును అందుకున్నారు . అతని సోదరులు, KM చెరియన్, KM ఫిలిప్ , KM మాథ్యూ మేనల్లుడు మామెన్ మాథ్యూ కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీతలే. పెద్ద సోదరుడు కెఎమ్ చెరియన్ కూడా పద్మభూషణ్ గ్రహీతలు కావడం విశేషం.

ఈ ఏడాది కంపెనీ ఆదాయం రూ. 23,261.17 కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరంలో ఇది రూ. 19,633.71 కోట్లుగా ఉంది. కంపెనీ నికర లాభం రూ.768.96 కోట్లు  నమోదైంది.  ఎంఆర్‌ఎఫ్‌  మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.42,000 కోట్లు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement