భారతీయులు ఎక్కువగా వాడుతున్న పాస్‌వర్డ్‌ ఇదే..!

This Is The Most Popular Password Of 2021 By Indians - Sakshi

నేటి డిజిటల్‌ యుగంలో స్మార్ట్‌ఫోన్స్‌,  సోషల్‌ మీడియా, యూపీఐ పేమెంట్స్‌ యాప్స్‌ వాడే వారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. భద్రత కారణాల దృష్ట్యా లేదా మన ప్రైవసీ పరంగా పాస్‌వర్డ్‌లను ఏర్పాటుచేస్తాం. శక్తివంతమైన పాస్‌వర్డ్స్‌ను ఏర్పాటు చేయడంతో ఆయా అకౌంట్లను, స్మార్ట్‌ఫోన్లను, ల్యాప్‌ట్యాప్‌లను సైబర్‌ దాడులకు గురికాకుండా చూడవచ్చును. అయితే పాస్‌వర్డ్స్‌ విషయంలో భారతీయుల గురించి తాజాగా ప్రముఖ సెక్యూరిటీ దిగ్గజం నార్డ్‌ పాస్‌  భయంకర నిజాలను వెల్లడించింది. 

ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు పాస్​వర్డ్ ఏర్పాటు​ చేసుకోవడంలో వెనుకబడి ఉన్నారని నార్డ్​ పాస్​ పేర్కొంది. చాలా మంది భారతీయులు ఎక్కువగా తమ  సోషల్​ మీడియా ఖాతాలకు ఒకే రకమైన పాస్​ వర్డ్ ఏర్పాటుచేస్తున్నారని వెల్లడించింది. సైబర్‌ నేరస్తులకు సులువుగా ఉండే పాస్‌వర్డ్‌లను ఉంచుతున్నట్లు నార్డ్‌ పాస్‌ పేర్కొంది. భారతీయుల వాడే 200 పాస్‌వర్డ్‌లో 62 పాస్‌వర్డ్‌లను సెకను కంటే తక్కువ వ్యవధిలో క్రాక్‌ చేయవచచ్చును. అయితే ప్రపంచవ్యాప్తంగా పాస్‌వర్డ్‌ రూపొందించడంలో అగ్రరాజ్యాలతో పోలిస్తే తక్కువ రిస్క్‌ భారతీయులు కల్గి ఉన్నట్లు నార్డ్‌పాస్‌ పేర్కొంది. 

భారతీయులు ఎక్కువ వాడే పాస్‌వర్డ్స్‌..
భారతీయులు ఎక్కువగా ‘password’ ను ఎక్కువగా తమ పాస్‌వర్డ్‌గా వాడుతున్నట్లు నార్డ్‌ పాస్‌ పేర్కొంది. అంతేకాకుండా 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567, qwerty, abc123, iloveyou వంటి పాస్‌వర్డ్‌లను వాడుతున్నుట్ల తెలుస్తోంది. వాటితో పాటుగా qwerty కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఈ పాస్‌వర్డ్‌లను సైబర్‌ నేరస్తులు కేవలం ఒక్క సెకనులో క్రాక్ చేయవచ్చునని నార్డ్‌ పాస్‌  స్పష్టం చేసింది. కొంతమంది తమ అభిమాన నటినటుల పేర్లను కూడా పాస్‌వర్డ్స్‌గా ఏర్పాటు చేస్తున్నారని నార్డ్‌ పాస్‌ తెలిపింది. అంతేకాకుండా sairam, krishna, omsairam  పేర్లను కూడా పాస్‌వర్డ్‌గా పెడుతున్నట్లు తేలింది.

శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఇలా రూపొందించండి.
సైబర్‌ నేరస్తుల నుంచి మీ అకౌంట్లను కాపాడుకోవాలంటే, బలమైన, శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఏర్పాటుచేసుకోవడం చాలా మంచింది. మీరు ఏర్పాటు చేసే పాస్‌వర్డ్ లో కచ్చితంగా 12 అక్షరాలు ఉండేలా చూసుకోవాలి. అప్పర్​కేస్​ లెటర్స్​, లోయర్​ కేస్​ లెటర్స్​, నెంబర్స్, స్పెషల్‌ సింబల్స్ ​(!,@,#,.....మొదలైనవి) వాటిని పాస్‌వర్డ్‌గా ఉంచాలి. అంతేకాకుండా 2 అథనిటికేషన్‌ పాస్‌వర్డ్‌ ఉంచుకోవడం మరింత మంచింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top