The Most Popular Crypto In 2021: అత్యంత ఆదరణను పొందిన క్రిప్టోకరెన్సీ ఏదంటే..?

The Most Popular Crypto In 2021 In Telugu - Sakshi

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ కరెన్సీకి భారీ ఆదరణ లభిస్తోంది. పలు దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ..  ఆయా దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. 2021లో చూసుకుంటే క్రిప్టో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్‌ అత్యంత ప్రజాదరణను పొందింది. అయితే గత ఏడాదిలో బిట్‌కాయిన్‌ కాకుండా ఇతర ఆల్ట్‌ కాయిన్స్‌ భారీ ఆదరణను పొందాయి. 

బిట్‌కాయిన్‌ కంటే దీనిపైనే..!
క్రిప్టోకరెన్సీల్లో  బిట్‌కాయిన్‌ కంటే షిబా ఇను గత 12 నెలల్లో సుమారు 188 మిలియన్లకు పైగా ఇన్వెస్టర్లు వీక్షించినట్లు కాయిన్‌మార్కెట్‌క్యాప్‌ వెల్లడించింది. అదే సమయంలో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ 145 మిలియన్ల వీక్షణలతో రెండవ స్థానంలో ఉంది. షిబా ఇను అనేది ఇప్పటికే ఉన్న మీమ్‌ కాయిన్ డోజ్‌కాయిన్‌కు స్పిన్-ఆఫ్. ఎలన్‌ మస్క్ అపారంగా నమ్మే డోజీకాయిన్‌ సుమారు 107 మిలియన్ వీక్షణలతో జాబితాలో 3వ స్థానంలో నిలిచింది.

కారణం అదే..!
క్రిప్టోకరెన్సీలో  బిట్‌కాయిన్‌ అత్యంత విలువను కల్గి ఉంది. ఒకానొక సమయంలో బిట్‌కాయిన్‌ సుమారు 50 లక్షలకు కూడా చేరింది. ఈ కాయిన్‌ ఇన్వెస్ట్‌ చేయాలంటే పెట్టుబడిదారులు కొంతమేర భయపడ్డారు. బిట్‌కాయిన్‌ కంటే ఆల్ట్‌కాయిన్స్‌ విలువ తక్కువగా ఉండడంతో వీటిపై ఇన్వెస్ట్‌ చేయడానికి పెట్టుబడిదారులు మొగ్గుచూపారు.  ఇకపోతే షిబా ఇను వచ్చి కేవలం 15 నెలలు అయినప్పటికీ, ప్రస్తుతం 18 బిలియన్‌ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలోనే 13వ అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉంది. అక్టోబర్‌లో ఈ  క్రిప్టోకరెన్సీ నాలుగు రోజుల్లోనే 133 శాతం పెరిగి, ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 0.000088 డాలర్లకు చేరింది. 


 

రాబిన్‌ హుడ్‌ యాప్‌లో 
షిబా ఇను ప్రముఖ స్టాక్ ట్రేడింగ్ యాప్, రాబిన్‌హుడ్‌లో జాబితా చేయబడే అవకాశం ఉందనే  పుకార్లు ఈ కాయిన్‌ విలువ భారీగా పెరిగింది. షిబా ఇను ఇన్వెస్టర్లు రాబిన్ హుడ్‌ లో లిస్ట్‌ చేయాలని ఆన్‌లైన్‌లో సంతకాల సేకరణ కూడా చేపట్టారు.  షిబా ఇను కాయిన్‌ను ఇప్పటికే ప్రసిద్ధ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ కాయిన్‌బేస్‌లో లిస్ట్‌ అయ్యింది. 

చదవండి: క్రిప్టో లావాదేవీల్లో అక్రమాలు.. రూ. 49 కోట్ల ఫైన్‌..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top