
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ.. సేవింగ్స్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో చేసిన ప్రకటనలు చాలామంది ఖాతాదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ వేలరూపాయల్లో ఉంచాలనే బ్యాంకుల నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ కథనంలో ఏ బ్యాంకులో ఎంత మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం.
ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్
మెట్రో, అర్బన్ ప్రాంతాలు: రూ. 15,000
సెమీ అర్బన్ ప్రాంతాలు: రూ. 7,500
గ్రామీణ ప్రాంతాలు: రూ. 2,500
హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్
మెట్రో, అర్బన్ ప్రాంతాలు: రూ. 10,000
సెమీ అర్బన్ ప్రాంతాలు: రూ. 5,000
గ్రామీణ ప్రాంతాలు: రూ. 2,500
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతాదారులు ప్రత్యేకించి సేవింగ్స్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు.
కోటక్ మహీంద్రా (Kotak Mahindra) బ్యాంక్:
దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయినా కోటక్ మహీంద్రా.. ఖాతాదారుల సేవింగ్స్ ఖాతా రకాన్ని బట్టి రూ. 10,000 నుంచి రూ. 20,000 మధ్య మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాలని నిర్దేశించింది.
యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్ తన వినియోగదారులు సెమీ-అర్బన్ లేదా రూరల్ బ్రాంచ్‌లతో సహా అన్ని ప్రదేశాలకు నెలకు సగటున రూ. 10,000 బ్యాలెన్స్ లేదా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి కనీసం రూ. 50,000 ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను కలిగి ఉండాలని ఆదేశించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా
మెట్రో శాఖలు: రూ. 2,000
సెమీ అర్బన్ శాఖలు: రూ. 1,000
గ్రామీణ శాఖలు: రూ. 500
పంజాబ్ నేషనల్ బ్యాంక్
మెట్రో శాఖలు: రూ. 2,000
అర్బన్ శాఖలు: రూ. 2,000
సెమీ అర్బన్ శాఖలు: రూ. 1,000
గ్రామీణ శాఖలు: రూ. 500
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మెట్రో & అర్బన్ శాఖలు: రూ. 1,000
సెమీ అర్బన్ శాఖలు: రూ. 500
గ్రామీణ శాఖలు: రూ. 250
కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్ కూడా అన్ని రకాల సేవింగ్స్ ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ అవసరాన్ని మాఫీ చేసింది.
ఐడీబీఐ బ్యాంక్
మెట్రో & అర్బన్ శాఖలు: రూ. 10,000
సెమీ అర్బన్ శాఖలు: రూ. 5,000
గ్రామీణ శాఖలు: రూ. 2,500
ఇండియన్ బ్యాంక్
మెట్రో & అర్బన్ బ్రాంచ్ స్థానాల్లో చెక్ సౌకర్యాలు ఉన్న పొదుపు ఖాతాలకు నెలకు రూ. 2,500 కనీస ఖాతా బ్యాలెన్స్ మరియు చెక్కు సౌకర్యాలు లేని ఖాతాలకు రూ. 1,000 నిర్వహించాలి.
సెమీ-అర్బన్ & గ్రామీణ శాఖల విషయంలో, బ్యాంకు తన కస్టమర్లు చెక్కు సౌకర్యాలతో రూ. 1,000, చెక్కు సౌకర్యాలు లేకుండా రూ. 500 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాలి.
ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ నిబంధనలు పాటించకపోతే పెనాల్టీలు విధిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ మొత్తం లోటులో 6% లేదా రూ.500 ఏది తక్కువైతే అది వసూలు చేస్తుంది. హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్ మెట్రో ప్రాంతాల్లో రూ.600 వరకు జరిమానా విధిస్తుంది. బ్యాంకు ఖాతా, ప్రదేశాన్ని అనుసరించి యాక్సిస్ బ్యాంక్ విభిన్నంగా పెనాల్టీలు విధిస్తుంది.
గమనిక: బ్యాంకులు సేవింగ్స్ ఖాతాల మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటాయి. కాబట్టి మినిమమ్ బ్యాలెన్స్ గురించి కచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి బ్రాంచ్ సందర్శించి తెలుసుకోవాలి.