ఈ మిడ్‌ క్యాప్‌ షేర్లకూ అమ్మకాల సెగ

Mid caps tumbles most with high volumes in weak market - Sakshi

మార్కెట్లను మించుతూ పతన బాట

కొన్ని కౌంటర్లలో  పెరిగిన ట్రేడింగ్‌ పరిమాణం

జాబితాలో నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌

సిటీ యూనియన్‌ బ్యాంక్‌, దీపక్ నైట్రైట్‌

ప్రిజమ్‌ జాన్సన్‌, లా ఒపాలా ఆర్‌జీ.. 

భారీ లాభాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి అమ్మకాల పిడుగు పడటంతో ఒక్కసారిగా కుప్పకూలాయి. వెరసి భారీ నష్టాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. దీంతో నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌, సిటీ యూనియన్‌ బ్యాంక్‌, దీపక్‌ నైట్రైట్‌, ప్రిజమ్‌ జాన్సన్‌, లా ఒపాలా ఆర్‌జీ.. పతన బాటలో సాగుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. వివరాలు చూద్దాం..

నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం కుప్పకూలి రూ. 1950 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1883 వరకూ జారింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 13,500 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 15,000 షేర్లు చేతులు మారాయి.

సిటీ యూనియన్‌ బ్యాంక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం పతనమై రూ. 135 దిగువన ట్రేడవుతోంది.  బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.42 లక్షల షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 5.85 లక్షల షేర్లు చేతులు మారాయి.

దీపక్‌ నైట్రైట్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతంపైగా దిగజారి రూ. 671 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.59 లక్షల షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 1.25 లక్షల షేర్లు చేతులు మారాయి.

ప్రిజమ్‌ జాన్సన్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం పడిపోయి రూ. 52 దిగువన ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 48,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్‌లో 1.02 లక్షల షేర్లు చేతులు మారాయి.

లా ఒపాలా ఆర్‌జీ
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం కోల్పోయి రూ. 205 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 27,000 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 23,000 షేర్లు చేతులు మారాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top