ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌.. ఒకటే జోరు | Mid and Small cap shares zoom in positive market | Sakshi
Sakshi News home page

ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌.. ఒకటే జోరు

Aug 11 2020 3:18 PM | Updated on Aug 11 2020 3:18 PM

Mid and Small cap shares zoom in positive market - Sakshi

ఆసియా మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 310 పాయింట్లు, నిఫ్టీ 85 పాయింట్లు చొప్పున ఎగశాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు మార్కెట్లను మించుతూ దౌడు తీస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో నెస్కో లిమిటెడ్‌, వైభవ్‌ గ్లోబల్‌, గర్వారే టెక్నికల్‌ ఫైబర్స్, ఆర్‌ సిస్టమ్స్‌, ఆల్‌సెక్‌ టెక్నాలజీస్‌  చోటు సాధించాయి. వివరాలు చూద్దాం...

నెస్కో లిమిటెడ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 16.5 శాతం దూసుకెళ్లింది. రూ. 524 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 6,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 52,000 షేర్లు చేతులు మారాయి.

వైభవ్‌ గ్లోబల్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 13.5 శాతం దూసుకెళ్లింది. రూ. 1920 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1958 వరకూ ఎగసింది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 10,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 6,000 షేర్లు మాత్రమే చేతులు మారాయి.

గర్వారే టెక్నికల్‌ ఫైబర్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం జంప్‌చేసి రూ. 1907 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2040 వరకూ ఎగసింది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 12,000 షేర్లు చేతులు మారాయి.

ఆర్‌ సిస్టమ్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 19 శాతం జంప్‌చేసి రూ. 119వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 120 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 5,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 47,000 షేర్లు చేతులు మారాయి.

ఆల్‌సెక్‌ టెక్నాలజీస్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 281 సమీపంలో ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 900 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 5,500 షేర్లు చేతులు మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement