Microsoft, Google Go Slow On Fresh Hiring Due To Hit By Slowing Economy, Details Inside - Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం ముప్పు..పడిపోయిన మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వృద్ధి రేటు

Published Wed, Oct 26 2022 3:41 PM

Microsoft, Google Go Slow On Fresh Hiring Due To Hit By Slowing Economy - Sakshi

ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం భయాలు అంతర్జాతీయ టెక్‌ సంస్థలకు భారీ షాకిచ్చాయి.  ప్రపంచం మాంద్యంలోకి  జారుతున్న వేళ..వడ్డీ రేట్ల పెంపుతో అదుపు చేసేందుకు అమెరికా చేసిన ప్రయత్నాల కారణంగా ఆ రెండు సంస్థల పనితీరు మందగించింది. దీంతో రానున్న రోజుల్లో టెక్‌ దిగ్గజాలు ఉద్యోగుల నియామకాల్ని తగ్గిస్తున్నట్లు తెలిపాయి.   

ఇటీవల విడుదల చేసిన కూ3 ఫలితాల్లో గూగుల్‌, యూట్యూబ్‌ సేల్స్‌ మూడు నెలల కాలానికి సెప్టెంబర్‌ వరకు 6శాతం మాత్రమే పెరిగాయి. సంస్థలు అడ్వటైజింగ్‌ మీద చేసే 69 బిలియన్‌ డాలర్ల ఖర్చును తగ్గించాయని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ తెలిపారు. వెరసి గూగుల్‌ దశాబ్ద కాలంలో కోవిడ్‌ ప్రారంభం నుంచి ఈ ఏడాది క్యూ3 (జులై, ఆగస్ట్‌, సెప్టెంబర్‌ )లో నిరాశజనకమైన ఫలితాల్ని సాధించింది. 
 
తమ సంస్థకు చెందిన కంప్యూటర్లు, ఇతర టెక్నాలజీ ప్రొడక్ట్‌లకు డిమాండ్‌ తగ్గిందని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. దీంతో సంస్థ అమ్మకాలు 50 బిలియన్‌ డాలర్లను నమోదు చేయగా..ఈ ఐదేళ్లలో సంస్థ వృద్ధిరేటు భారీగా పడిపోయింది. 

నియామకాల్ని తగ్గిస్తాం
వార్షిక ఫలితాల విడుదల అనంతరం గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ మాట్లాడుతూ.. గతంతో పోల్చితే క్యూ4 లో ఉద్యోగుల నియామకాలు సగానికి కంటే తక్కువగా ఉంటాయని తెలిపారు.

Advertisement
Advertisement