సూక్ష్మ రుణాలు 25 శాతం డౌన్‌ | microfinance institutions disbursed a total loan amount of Rs 1,12,459 crores | Sakshi
Sakshi News home page

సూక్ష్మ రుణాలు 25 శాతం డౌన్‌

Jun 13 2025 6:33 AM | Updated on Jun 13 2025 8:02 AM

microfinance institutions disbursed a total loan amount of Rs 1,12,459 crores

2024–25లో వితరణ రూ.1.12 లక్షల కోట్లు 

సగటు రుణంలో 12 శాతం వృద్ధి 

న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేసిన రుణాల మొత్తం రూ.1,12,459 కోట్లుగా ఉంది. మొత్తం 2.2 కోట్ల ఖాతాదారులకు ఈ మొత్తం రుణాల రూపంలో అందింది. 2023–24లో ఈ రంగం పంపిణీ చేసిన రుణాల మొత్తంతో పోల్చితే 25 శాతం తగ్గినట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్‌వర్క్‌ (ఎంఫిన్‌) తెలిపింది. 2023–24తో పోల్చితే 2024–25లో ఒక్కో ఖాతావారీ సగటు రుణ పంపిణీ 12.3 శాతం అధికంగా రూ.50,131గా ఉంది. ఎన్‌బీఎఫ్‌సీ–ఎఎంఫ్‌ఐ రంగం గత ఆర్థిక సంవత్సరంలో రూ.57,307 కోట్లను రుణాల రూపంలో సమకూర్చుకుంది. 

అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 36 శాతం ఎక్కువ. ఎన్‌బీఎఫ్‌సీ–ఎఎంఫ్‌ఐ సమీకరించిన రుణ నిధుల్లో 78.4 శాతం బ్యాంకుల నుంచి లభించింది. 11.9 శాతం నాన్‌ బ్యాంకుల నుంచి, 5.1 శాతం ఈసీబీల రూపంలో వచి్చంది. 2025 మార్చితో ముగిసిన చివరి మూడు నెలల కాలంలో ఎంఎఫ్‌ఐ నిర్వహణ ఆస్తులు (రుణాలు) 2024 మార్చి త్రైమాసికంతో పోల్చి చూస్తే 11.9 శాతం తగ్గి రూ.1,47,279 కోట్లుగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా ఎంఎఫ్‌ఐ పోర్ట్‌ఫోలియోని గమనిస్తే.. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల వాటా 33 శాతంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలు 28 శాతం, ఉత్తరాది 17 శాతం, పశ్చిమ భారత్‌ వాటా 14 శాతం చొప్పున ఉంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement