2 కొత్త ఫీచర్లతో Mi స్మార్ట్‌ బ్యాండ్‌ 5

Mi fitness band 5 with 2 new features - Sakshi

రోజంతా స్లీప్‌ ట్రాకర్‌ సపోర్ట్‌

స్ట్రాప్స్‌ తొలగించకుండానే చార్జింగ్‌కు వీలు

యానిమేటెడ్‌ కేరక్టర్స్‌తో వాచ్‌ ఫేసెస్‌

ముంబై, సాక్షి: టెలికం కంపెనీ షియోమీ తయారీ ఎంఐ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ 5 తాజాగా రెండు కొత్త పీచర్స్‌ను జత చేసుకుంది. ఫర్మ్‌వేర్‌ అప్‌డేట్‌ ద్వారా ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ను మరింత ఆధునీకరించింది. విజయవంతమైన ఎంఐ బ్యాండ్‌ 4కు పొడిగింపుగా.. స్లీక్‌ డిజైన్‌లో వచ్చిన ఎంఐ స్మార్ట్‌ బ్యాండ్ ‌5లో రెండు ప్రధాన ఫీచర్స్‌ను అప్‌డేట్‌ చేసింది. 24గంటలపాటు నిద్రను ట్రాక్‌ చేసే స్లీప్‌ ట్రాకింగ్‌ సపోర్ట్‌ ఫీచర్‌ను ఏర్పాటు చేసింది. వెరసి ఈ సిరీస్‌లో వచ్చిన బ్యాండ్స్‌లో తొలిసారి స్లీప్‌ ట్రాకర్‌ ఫీచర్‌కు తెరతీసింది. ఎంఐ స్మార్ట్‌ బ్యాండ్‌ 5 ఓలెడ్‌ డిస్‌ప్లేతో 1.2 అంగుళాల తెరను కలిగి ఉంటుంది. టచ్‌ బటన్‌ అడుగుభాగాన ఉంటుంది. 

యానిమేటెడ్‌ కేరక్టర్స్‌
ఎంఐ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ 5లో షియోమీ పలు సుప్రసిద్ధ కార్టూన్‌ కేరక్టర్స్‌తో కూడిన యానిమేటెడ్‌ వాచ్‌ ఫేసెస్‌కు వీలు కల్పించింది. ఫిట్‌నెస్‌ను ట్రాక్‌ చేసేందుకు 11 మోడ్స్‌ అందుబాటులో్ ఉంటాయి. మహిళలు మెన్‌స్ట్రువల్‌ సైకిల్స్‌ను ట్రాక్‌ చేసుకునేందుకు వీలుంది. శారీరక కదలికలు, హార్ట్‌రేట్‌ నమోదు చేసే పీఏఐ ఫంక్షనాలిటీని జత చేసింది. స్మార్ట్‌ఫోన్‌కుగల కెమెరా షట్టర్‌కు రిమోట్‌గా కూడా బ్యాండ్ ‌5ను వినియోగించవచ్చు. ఇక మరో ప్రధాన అంశం చార్జింగ్‌ టెక్నాలజీ. తాజా మోడల్‌లో చార్జింగ్‌ కోసం ట్రాకర్‌ను స్ట్రాప్స్‌ నుంచి వేరుచేయవలసిన అవసరముండదు. ఇతర స్మార్ట్‌ బ్యాండ్స్‌ తరహాలో మ్యాగ్నటిక్ డాక్‌ను అందిస్తోంది. తద్వారా స్ట్రాప్స్‌ తొలగించకుండానే బ్యాండ్‌ను డాక్‌లో ఉంచి చార్జింగ్‌ చేసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top