MediaTek: ప్రపంచంలోనే తొలిసారిగా...! మీడియాటెక్‌ నుంచి పవర్‌ఫుల్‌  ప్రాసెసర్‌..!

Mediatek Takes On Qualcomm With New Flagship Soc For Premium Android Phones - Sakshi

క్వాలకమ్‌ పోటీగా ప్రముఖ చిప్‌మేకర్ మీడియా టెక్ సంస్థ  ‘డైమెన్సిటీ 9000 5జీ’ పేరుతో కొత్త చిప్‌సెట్‌ను లాంచ్‌ చేసింది. ఈ కొత్త చిప్‌సెట్‌ను ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో వాడనున్నట్లు తెలుస్తోంది. ఎన్‌4 చిప్‌మేకింగ్ ద్వారా ఈ కొత్త డైమెన్సిటీ 9000 5జీ చిప్‌సెట్‌ తయారుచేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఎన్‌4 చిప్‌మేకింగ్‌ టెక్నాలజీ ఉపయోగించి చేసిన  చిప్‌గా నిలుస్తోందని కంపెనీ పేర్కొంది. కాంపాక్ట్‌ సైజ్‌తో, అత్యంత వేగవంతమైన పర్ఫార్మెన్స్‌తో పనిచేయనున్నాయి.
చదవండి: భారత మార్కెట్లపై దండయాత్ర చేయనున్న మోటరోలా..!

గత ఏడాది మీడియాటెక్‌ సంస్థ సుమారు 10 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం లాంచ్‌ చేసిన కొత్త చిప్‌సెట్‌తో ఈ ఏడాది గాను కంపెనీ ఆదాయం 17 బిలియన్ల డాలర్లకు చేరుకోవాలని మీడియాటెక్‌ భావిస్తోంది. మీడియాటెక్‌ 4జీ చిప్‌లు బహిరంగ మార్కెట్లలో 10 డాలర్లకు అమ్ముడవుతుండగా...ఈ 5జీ చిప్‌సెట్‌లను 30 నుంచి 50 డాలర్లకు విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రపంచంలోని 5జీ స్మార్ట్‌ఫోన్‌ చిప్‌ తయారీ కంపెనీల్లో మీడియో టెక్‌ మూడో స్థానంలో నిలవగా, తొలి స్థానంలో క్వాలకమ్‌, రెండో స్థానంలో  శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌  చిప్‌సెట్స్‌ ఉన్నాయి. షావోమీ, ఒప్పో, వివోకు చెందిన తక్కువ, మధ్య స్థాయి స్మార్ట్‌ఫోన్లలో మీడియాటెక్‌  ప్రాసెసర్లను వాడుతున్నారు. 
చదవండి: క్రిప్టో కరెన్సీపై ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ కీలక వ్యాఖ్యలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top