కారు మళ్లీ టాప్‌గేరు! | Maruti, Tata Motors post double-digit growth in February | Sakshi
Sakshi News home page

కారు మళ్లీ టాప్‌గేరు!

Mar 2 2021 5:58 AM | Updated on Mar 2 2021 5:58 AM

Maruti, Tata Motors post double-digit growth in February - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 నేపథ్యంలో వ్యక్తిగత రవాణా వాహనాలకు నెలకొన్న డిమాండ్‌ ఇంకా కొనసాగుతోంది. ఫలితంగా ఆటో కంపెనీలు ఫిబ్రవరి వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్‌లు అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. టయోటా కిర్లోస్కర్‌ మోటార్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హోండా కార్స్‌ ఇండియా కంపెనీలు కూడా డీలర్లకు పెద్ద ఎత్తున వాహనాలను సరఫరా చేశాయి.  మారుతీ సుజుకీ ఫిబ్రవరిలో మొత్తం 1.52 లక్షల వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 1.36 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 12 శాతం అధికం. కాంపాక్ట్, యుటిలిటీ వాహన విభాగాల్లో అధికంగా విక్రయాలు జరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే నెలలో దేశీయ వాహన అమ్మకాల్లో 29 శాతం వృద్ధిని సాధించినట్లు హ్యుందాయ్‌ ఇండియా ప్రకటించింది. టాటా మోటార్స్‌ కంపెనీ ప్యాసింజర్‌ విభాగంలో మొత్తం 27,225 యూనిట్లను విక్రయించి రెండు రెట్ల వృద్ధిని సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement