తీవ్ర ఆటుపోట్ల మధ్య ట్రిపుల్‌ సెంచరీ | Sakshi
Sakshi News home page

తీవ్ర ఆటుపోట్ల మధ్య ట్రిపుల్‌ సెంచరీ

Published Tue, Sep 1 2020 9:45 AM

Market jumps despite high volatility- Sensex triple century - Sakshi

ముందురోజు నమోదైన భారీ పతనం నుంచి దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. అయితే దేశీ జీడీపీ అనూహ్య క్షీణత, చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో తీవ్ర ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. తొలుత లాభాల డబుల్‌ సెంచరీ చేసిన సెన్సెక్స్‌ వెనువెంటనే నష్టాలలోకి ప్రవేశించింది. తిరిగి లాభాల బాట పట్టింది. ప్రస్తుతం 324 పాయింట్లు జంప్‌చేసి 38,952 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో నిఫ్టీ 109 పాయింట్లు ఎగసి 11,496 వద్ద కదులుతోంది. సోమవారం అమెరికా ఇండెక్సులు రికార్డు గరిష్టాల నుంచి వెనకడుగు వేయగా.. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి వ్యక్త మవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,037 వద్ద గరిష్టాన్ని తాకగా.. 38,563 వద్ద కనిష్టానికీ చేరడం గమనార్హం!

ప్రధాన రంగాలన్నీ
ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన రంగాలన్నీ 2-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, గ్రాసిమ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఓఎన్‌జీసీ 3 శాతం క్షీణించగా, గెయిల్, ఐటీసీ, బీపీసీఎల్‌, ఐవోసీ, ఇన్ఫోసిస్‌ 1-0.3 శాతం మధ్య డీలాపడ్దాయి.

ఎస్కార్ట్స్‌ ప్లస్‌
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఎస్కార్ట్స్‌, ఐడియా, ఆర్‌ఈసీ, సెయిల్‌, బయోకాన్‌, జిందాల్‌ స్టీల్‌, పీఎఫ్‌సీ, పీవీఆర్‌ 5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క  గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఎంజీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ 1.2-0.2 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు1.4-1 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1090 లాభపడగా.. 702 నష్టాలతో కదులుతున్నాయి. 

Advertisement
Advertisement