‘ఈ పన్నుని రద్దు చేయండి’- కేంద్రానికి వినతుల వెల్లువల

Market Experts Requested Government To Revoke STT TAX - Sakshi

ఎస్‌టీటీ రద్దు చేయాలి 

మార్కెట్‌ నిపుణుల అభ్యర్థన   

న్యూఢిల్లీ: వచ్చే నెల మొదట్లో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ లావాదేవీ పన్ను(ఎస్‌టీటీ)ను రద్దు చేయాలని మార్కెట్‌ నిపుణులు అభ్యర్థించారు. తద్వారా ఈక్విటీ ట్రేడర్లకు ఉపశమనం కల్పించవలసిందిగా కోరారు. ఈ నిర్ణయం క్యాపిటల్‌ మార్కెట్లను బలపరచడంతోపాటు కొత్త ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు.

 2004లో ప్రభుత్వం వివిధ రకాల సెక్యూరిటీలు, కొనుగోళ్లు లేదా అమ్మకపు లావాదేవీల ఆధారితంగా ఎస్‌టీటీని ప్రవేశపెట్టింది. దీంతో వివిధ సెక్యూరిటీలు, విభిన్న లావాదేవీల ఆధారంగా 0.025 శాతం నుంచి 0.25 శాతం మధ్య ఎస్‌టీటీ విధింపు అమలవుతోంది. అటు దీర్ఘకాలిక, ఇటు స్వల్పకాలిక పెట్టుబడి లాభాలపై ఎస్‌టీటీ రద్దయితే పెట్టుబడులు మరింత ఊపందుకునే వీలున్నట్లు జిరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ పేర్కొన్నారు. ఒకవేళ ఎస్‌టీటీని రద్దుచేయకుంటే దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్నునైనా తొలగించేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top