
న్యూఢిల్లీ: రుణ ఊబిలో చిక్కుకున్న హిందుస్తాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థ(HNGIL)ను దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా చేజిక్కించుకున్నట్లు ఉగాండాకు.. చెందిన మధ్వాని గ్రూప్ కంపెనీ ఇండిపెండెంట్ షుగర్ కార్పొరేషన్ (INSCO) లిమిటెడ్ తెలిపింది.
కొత్తగా ఏర్పడిన హెచ్‌ఎన్‌జీఐఎల్ బోర్డు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఈ కొనుగోలు ప్రక్రియ పారిశ్రామికవేత్తలు కమ్లేష్ మాధ్వాని, శ్రై మాధ్వాని నేతృత్వంలో జరిగింది. సెర్బరస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి ఆర్థిక మద్దతు లభించిందని ఐఎన్‌ఎస్‌సీఓ ప్రకటన ద్వారా తెలిపింది.
దాదాపు రూ.2,250 కోట్ల ఈ రిజల్యూషన్ ప్రణాళికకు ఆగస్టు 14న ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. తదుపరి ఆర్‌బీఐ, సీసీఐ నుంచి అనుమతులు లభించాయి. మొత్తం 45 రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తి అయినట్లు ఐఎన్‌ఎస్‌సీఓ పేర్కొంది.