
పర్మనెంట్ అకౌంట్ నంబర్లు (PAN), టాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నంబర్లు (TAN)కు సంబంధించిన అన్ని సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన 'పాన్ 2.0' (PAN 2.0) ప్రాజెక్ట్ అమలు చేయడానికి కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం 'ఎల్‌టీఐమైండ్‌ట్రీ' (LTIMindtree) సంస్థను ఆదాయ పన్ను శాఖ ఎంపిక చేసింది.
పాన్ 2.0 ప్రాజెక్ట్ అమలు కోసం 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. డిజైన్, డెవలప్‌మెంట్, కార్యకలాపాలు వంటి వాటితో పాటు నిర్వహణను కూడా ఎల్‌టీఐమైండ్‌ట్రీ చూసుకుంటుంది.
పాన్ సంబంధిత సేవల కోసం ప్రస్తుతం.. ఈ-ఫైలింగ్ పోర్టల్, యూటీఐఐటీఎస్‌ఎల్ పోర్టల్, ప్రొటీన్ ఈ-గవర్నెన్స్ పోర్టల్ అనే ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అయితే పాన్ 2.0 వీటన్నింటినీ ఒకే ఏకీకృత పోర్టల్‌గా అనుసంధానిస్తుంది. దీనికోసం నవంబర్ 2024న కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కంపెనీ రూ. 1435 కోట్లను కేటాయించింది.
ఇదీ చదవండి: FASTag Annual Pass: ఒక్కసారి చెల్లిస్తే.. ఏడాదంతా ఫ్రీ జర్నీ
పాత పాన్ కార్డులు రద్దవుతాయా?
క్యూర్ కోడ్ పాన్ కార్డులు వస్తే.. పాత పాన్ కార్డులు రద్దవుతాయా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ పాత పాన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం లేదని ఆదాయ పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. పాన్ 2.0 ప్రవేశపెట్టడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. కొత్త టెక్నాలజీతో ట్యాక్స్ పేయర్లకు మెరుగైన సేవలు అందించడమే. నాణ్యమైన సేవలను సులభంగా, వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పాన్ 2.0కు సిద్ధమైంది. కాబట్టి రాబోయే పాన్ కార్డులు క్యూఆర్ కోడ్‌తో రానున్నాయి.