అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!

lookalike Apple Watch Ultra Gizmore has launched Rs 1999 vogue - Sakshi

సాక్షి, ముంబై: ఖరీదైన యాపిల్‌ వాచ్‌ కొనుగోలు చేయలేని వారికి  గిజ్‌మోర్‌ తీపి కబురు అందించింది. అచ్చం యాపిల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌వాచ్ ‘అల్ట్రా’ లా కనిపించే స్మార్ట్‌వాచ్‌ను భారతీయ బ్రాండ్ గిజ్‌మోర్‌ తీసుకొచ్చింది. అదీ కూడా కేవలం 1,999 రూపాయలకే. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 2023 నుండి అందుబాటులో ఉంటుంది. బ్లాక్, ఆరెంజ్, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 

(ఇదీ చదవండి: ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్‌ వచ్చేస్తోంది!150 కి.మీ. రేంజ్‌లో)
బడ్జెట్‌ ధరలో గిజ్‌మోర్‌ తీసుకొచ్చిన  కొత్త వాగ్‌ స్మార్ట్‌వాచ్  ఫీచర్లు  ఎలా ఉన్నాయంటే
స్మార్ట్‌వాచ్‌కు 10రోజుల బ్యాటరీ లైఫ్‌,  1.95-అంగుళాల HD డిస్‌ప్లే 320X385 పిక్సెల్స్‌, 91% బాడీ-టు-స్క్రీన్ రేషియో, మెరుగైన ఫారమ్ ఫ్యాక్టర్‌తో పెద్ద ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లేను అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ షార్ట్‌కట్ మెనూ కోసం స్ప్లిట్-స్క్రీన్  వ్యూ కూడా ఉంది.  పవర్ ఆన్ అండ్‌  ఆఫ్ కోసం 2 ప్రత్యేక బటన్స్‌, ఎపుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే స్క్రీన్ 600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ GPS ట్రాజెక్టరీ ఫీచర్‌ను  హార్ట్‌ రేట్‌, ఆక్సిజన్‌ లెవల్స్‌,  పీరియడ్‌ ఎలర్ట్‌, స్లీప్‌ సైకిల్‌, meditation, sedentary and dehydration లాంటి రిమైండర్స్‌ కూడా ఇస్తుందట.   

యాపిల్‌ స్మార్ట్‌వాచ్ ‘అల్ట్రా’ ప్రారంభ ధర రూ. 89,900.

(మళ్లీ ఉద్యోగాల కోత..12 నెలల్లో 1400మందిని తొలగించిన స్టార్టప్‌)

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top