లండన్‌ టీ ఎక్సేంజ్.. ఫ్రాంచైజీకే కోటిన్నర రూపాయలు..

London Tea Exchange Going To Start Its Franchise Stores In India - Sakshi

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ హౌజ్‌గా పేరున్న లండన్‌ టీ ఎక్సేంజ్‌ (ఎల్‌టీఈ) ఇండియాలోకి ఎంట్రీ ఇస్తోంది. వ్యాపార విస్తరణలో భాగంగా ప్రపంచంలోనే అతి పెద్ద టీ మార్కెట్‌గా ఉన్న ఇండియాలో తమ ఛాయ్‌ రుచులు పంచేందుకు రెడీ అవుతోంది. 

ప్రిన్స్‌ ఛార్లెస్‌తో మొదలు
బ్రిటీ రాజవంశానికి చెందిన ప్రిన్స్‌ ఛార్లెస్‌ 1552లో పోర్చగీస్‌కి చెందిన ప్రిన్సెస్‌ కెథరీన్‌ బంగాజాను వివాహం చేసుకున్న సందర్భంబంగా లండన్‌ టీ ఎక్సేంజ్‌ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంపన్న శ్రేణికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉపయోగించే టీ హౌజ్‌గా ఎల్‌టీఈకి గుర్తింపు ఉంది. ఐదు వందల ఏళ్లలో అనేక యాజమన్యాలు మారినా ఎల్‌టీఈ ప్రత్యేకత చెక్కు చెదరలేదు. కాగా తాజాగా ఎల్‌టీఈ ఇండియాలో భారీ ఎత్తున విస్తరించే ప్రణాళికను అమలు చేస్తోంది.

కోల్‌కతా మూలాలు
ఇండియాలో ముందుగా ఢిల్లీ లేదా బెంగళూరులో తొలి టీ హౌజ్‌ను ఆరంభించే యోచనలో ఉన్నట్టు ఎల్‌టీఈ ఇండియా వ్యవహరాలు చూస్తోన్న రహ్మాన్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎల్‌టీకీ గ్లోబల్‌ సీఈవోతో పాటు ఇండియాలో మాస్టర్‌ ఫ్రాంచైజీగా వ్యవహరిస్తున్నారు. రహ్మన్‌ పూర్వీకులు కొల్‌కతకు చెందిన వారు కావడంతో ఎల్‌టీఈని ఇండియాలో విస్తరించే యోచనలో ఉన్నారు.

ఫ్రాంచైజీలు
బోయే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 200 స్టొర్లను అందుబాటులోకి తేవాలని లండన్‌ టీ ఎక్సేంజ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మొదటి ఏడాదే 50 స్టోర్లను ప్రారంభిస్తామని ఎల్‌టీఈ ప్రతినిధులు జాతీయ మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఢిల్లీ/బెంగళూరు తర్వాత ముంబై, హైదరాబాద్‌, చెన్నైలలో స్టోర్లు ప్రారంభించనున్నారు. ఎల్‌టీఈ స్టోర్‌ ఫ్రాంచైజీ దక్కించుకోవాలంటే పోష్‌ ఏరియాలో లోకేషన్‌ చూసుకోవడంతో పాటు సగటున కోటిన్నర రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 

కేజీ రూ. 13 కోట్లు
లండన్‌ టీ ఎక్సేంజీ (ఎల్‌టీఈ) స్టోర్లలో టీ ప్రారంభం ధర రూ.120 ఉంటుందని అంచనా.. ఇక ఎల్‌టీఈకే ప్రత్యేకమైన బంగారంతో చేసిన ప్రత్యేక టీ పొడి ఖరీదు కేజీ రూ. 13 కోట్లు ఉంటుందట!  ఈ టీని ఖరీదు చేస్తే స్థోమత సామాన్యులకు లేనట్టే. కాబట్టి ఈ బంగారం కలిసిన టీ పొడిని స్టోర్లలో ప్రదర్శనకు పెట్టినా.. అమ్మడం కష్టమేనంటున్నారు. ముందు నుంచి కూడా రికార్డులు కోరుకునేవారు, సూపర్‌ రిచ్‌ పీపుల్స్‌ దీన్ని భరించగలరంటున్నారు ఎల్‌టీఈ ప్రతినిధులు.

చదవండి👉 Gautam Adani: వారెన్‌ బఫెట్‌కు భారీ షాక్‌! రికార్డులన్నీ తొక్కుకుంటూ పోతున్న అదానీ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top