
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయరీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ లీ హెల్త్ డొమైన్.. సహజ పదార్థాలతో న్యూట్రాస్యూటికల్ ట్యాబ్లెట్స్‌ను యాక్టోకిన్ పేరుతో విడుదల చేసింది. కరోనా వంటి వైరస్ సంబంధ అంటువ్యాధుల బారినపడ్డ వారిలో కీళ్ల నొప్పులు, చేతులు, అరచేతులు, కాళ్లు, పాదాలలో మంట, తిమ్మిరి, జలదరింపు తదితర నరాల సమస్యలను తగ్గించడానికి, అలసట నుండి ఉపశమనం పొందడానికి సహాయక చికిత్సగా శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ చర్యతో వీటిని రూపొందించింది.
ఇందులోని కొలాజెన్, బోస్వెలియా సెరాటా, కుర్కుమిన్ ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా నొప్పి నివారణ మందుల స్థానంలో ఉపయోగించవచ్చని కంపెనీ డైరెక్టర్ ఆళ్ల లీలారాణి తెలిపారు.
చదవండి: కోవిడ్ ఔషధం వచ్చేసింది!