ఐటీ స్టాక్స్‌ జోరు, లాభాల్లో ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ షేర్లు

 L And T Technology Services Get Profit 84 Percent - Sakshi

ముంబై: ఎల్‌అండ్‌టీ అనుబంధ సంస్థ ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఎల్‌టీటీఎస్‌) జూన్‌ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించింది. కంపెనీ లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 84 శాతం పెరిగి రూ.117 కోట్ల నుంచి రూ.216 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 19 శాతం వృద్ధితో రూ.1,562 కోట్లుగా నమోదైంది.

నిర్వహణ లాభం 17.3 శాతంగా ఉంది. ఆదాయ వృద్ధి 2021–22లో 15–17 శాతం మధ్య ఉండొచ్చన్న అంచనాలను వ్యక్తం చేసింది. ‘‘యూఎస్, యూరోప్‌లో (ఈ రెండు ప్రాంతాల నుంచి 80 శాతం ఆదాయం) దాదాపు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. జపాన్, భారత్‌లోనూ సాధారణ పరిస్థితులు ఏర్పడనున్నాయి’’ అని కంపెనీ సీఈవో, ఎండీ అమిత్‌చద్దా తెలిపారు. బీఎస్‌ఈలో కంపెనీ షేరు 3 శాతం లాభపడి రూ.2,910 వద్ద క్లోజయింది. 

చదవండి : వాహనాల కొనుగోళ్లు, రెండింతలు పెరిగింది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top