
ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ (ఐఎస్ఆర్ఎల్) కేటీఎం రేసింగ్, ట్రైకలర్ మోటార్ స్పోర్ట్స్ మధ్య కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీని కింద ఐఎస్ఆర్ఎల్ సీజన్2లో కేటీఎం ప్రత్యేక నేమింగ్ రైట్స్ పార్టనర్, అధికారిక బైక్ భాగస్వామిగా మారింది. బ్రాండ్ అంబాసిడర్, ఇన్వెస్టర్‌గా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ లీగ్‌కు మద్దతిస్తున్నారు.
ఈ భాగస్వామ్యం కింద, కేటీఎం ట్రైకలర్ మోటార్ స్పోర్ట్స్ పేరుతో రేసింగ్ టీమ్ పోటీపడనుంది. భారతీయ మోటార్ స్పోర్ట్ ఫ్రాంచైజీకి ఒక ప్రపంచ మోటార్ సైకిల్ తయారీ సంస్థ పేరు హక్కులను పొందడం ఇదే మొదటిసారి. అనేక ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్స్ తో కేటీఎం దశాబ్దాల ప్రపంచ రేసింగ్ నైపుణ్యాన్ని మోటోక్రాస్, సూపర్ క్రాస్‌లలో తీసుకురానుంది.
ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ వ్యవస్థను నిర్మించడానికి ప్రపంచ బ్రాండ్లను భారతీయ జట్లతో ఏకం చేయాలనే లీగ్ దృష్టికి ఈ భాగస్వామ్యం సరిపోతుందని ఐఎస్ఆర్ఎల్ ప్రమోటర్ వీర్ పటేల్ అన్నారు. టీవీ, ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో 20 మిలియన్లకు పైగా వీక్షకులతో విజయవంతమైన సీజన్ 1 తరువాత, సీజన్2 అక్టోబర్ 25-26 తేదీల్లో ప్రారంభమవుతుంది. తర్వాత రేసులు డిసెంబర్ 6-7, డిసెంబర్ 20-21 తేదీలలో మూడు వేర్వేరు వేదికలలో జరుగుతాయి.