కియా కార్లు.. భారీ డిస్కౌంట్లు, బంపర్‌ ఆఫర్లు | Kia April Bonanza: Save Big on SUVs and EVs This Month | Sakshi
Sakshi News home page

కియా కార్లు.. భారీ డిస్కౌంట్లు, బంపర్‌ ఆఫర్లు

Apr 20 2026 3:00 PM | Updated on Apr 20 2026 3:15 PM

Kia April Bonanza: Save Big on SUVs and EVs This Month

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన కస్టమర్లకు ఏప్రిల్ 2026 కానుకగా అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. తన లైనప్‌లోని ఎంపీవీ (MPV), ఎస్‌యూవీ (SUV) మోడళ్లపై భారీ ప్రయోజనాలను అందిస్తోంది. క్యాష్‌ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్లతో కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. మోడళ్ల వారీగా ఆఫర్ల వివరాలు ఇక్కడ తెలుసుందాం.

కియా కార్నివాల్ 
ఈ నెల ఆఫర్లలో అత్యధిక లబ్ధి పొందుతున్న మోడల్ కార్నివాల్ (Kia Carnival). 2025లో తయారైన (PY25) యూనిట్లపై గరిష్టంగా రూ. 3.20 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. ఇందులో రూ. 50,000 నగదు తగ్గింపు, రూ. 2 లక్షల భారీ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 50,000 కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇక 2026 మోడల్‌ ఇయర్‌ (MY26) కొత్త స్టాక్‌పై రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు లభిస్తాయి.

కియా సెల్టోస్ 
మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెల్టోస్‌ (Kia Seltos)పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. 2025 మోడల్‌ ఇయర్‌ యూనిట్లపై మొత్తం రూ. 1.35 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో రూ. 40,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 60,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి.

కియా సైరోస్ 
కియా కొత్త మోడల్ సైరోస్ (Kia Syros) డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌పై కూడా కంపెనీ భారీ రాయితీలు ఇస్తోంది. 2025లో తయారైన యూనిట్లపై రూ. 70,000 నగదు తగ్గింపుతో కలిపి మొత్తం రూ. 1.55 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే 2026 మోడల్‌ ఇయర్‌ యూనిట్లపై రూ. 60,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

కియా కారెన్స్ క్లావిస్ ఈవీ 
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కారెన్స్ క్లావిస్ ఈవీ (Kia Carens Clavis EV)పై సైతం భారీ ఆఫర్లు ప్రకటించారు. 2025లో తయారైన HTM వేరియంట్‌పై ఏకంగా రూ. 2.15 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇందులో రూ. 85,000 నగదు తగ్గింపు, రూ. 75,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రధాన ఆకర్షణ.అదే విధంగా కొత్త మోడళ్లపై (MY26 యూనిట్లు) రూ. 90,000 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

అయితే పైన పేర్కొన్న ఆఫర్లు డీలర్‌షిప్ లొకేషన్‌, స్టాక్ లభ్యత, కొనుగోలుదారు అర్హతపై ఆధారపడి మారుతుంటాయి. పూర్తి వివరాల కోసం సమీపంలోని అధీకృత కియా డీలర్‌షిప్‌ను సంప్రదించడం మంచిది.

Advertisement
 
Advertisement
Advertisement