Justin Bieber: పాప్‌ స్టార్‌ జస్టిన్‌ బీబర్‌కు భారీ షాక్‌!

Justin Bieber banned by Ferrari - Sakshi

అమెరికన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌కు ఇటాలియన్‌ సూపర్‌ కార్‌ మ్యానిఫ్యాక్చరర్‌ ఫెరారీ సంస్థ భారీ షాకిచ్చింది. ఈ పాప్‌ స్టార్‌ ఫెరారీ కారును వినియోగించేందుకు వీలు లేదని హెచ్చరించింది. 

ఇటలీకి చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఇల్ జియోర్నాలే నివేదిక ప్రకారం..ఫెరారీ సంస్థ జస్టిన్‌ బీబర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఫెరారీ కార్ల పట్ల జస్టిన్‌ బీబర్‌కు నైతిక విలువలు లేవని, వాటిని మెయింటెన్స్‌ చేయడంలో విఫలం అయ్యాడని,అందుకే ఫెరారీ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా సంస్థ తెలిపింది.  
ఫెరారీ సంస్థ తన కార్లను సరైన రీతిలో వినియోగించని సెలబ్రిటీలపై ఆంక్షలు విధించడం సర్వసాధారణం. గతంలో హాట్‌ మోడలింగ్‌తో గ్లోబల్‌ వైడ్‌గా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న కిమ్‌ కర్దాషియన్‌తో పాటు, నికోలస్ కేజ్, ర్యాపర్ 50సెంట్ వంటి ప్రముఖులు ఫెరారీ కార్లను వినియోగించకుండా నిషేధించింది.

తాజాగా ర్యాపర్‌ జస‍్టిన్‌ బీబర్‌పై అదే తరహాలో చర్యలు తీసుకుంది. జస‍్టిన్‌ బీబర్‌కు చెందిన ఎఫ్ 458ను నిర్వహణలో అలసత్వం వహించడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జస్టిన్ బీబర్ ఫెరారీ రంగును మార్చడం, వేలం వేయడం వంటి అంశాలే ఫెరారీ సంస్థ జస్టిన్‌ బీబర్‌పై నిషేదం విధించే కారణాల్లో ఇవి కూడా ఉన్నాయి.

గతంలో జస్టిన్ బీబర్ తన ఎఫ్ 458ని కొనుగోలు చేసిన కొన్ని నెలల తరువాత బెవర్లీ హిల్స్ నైట్ క్లబ్ వెలుపల పార్కింగ్‌ చేశాడు. నాటి నుంచి బీబర్‌కు ఫెరారీ కార్ల విషయంలో ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటుంన్నాడు. బెవర్లీ హిల్స్ నైట్ క్లబ్‌లో పార్కింగ్‌ చేసిన తర్వాత ఆ కారు మిస్‌ అవ్వడం కలకలం రేగింది. దీంతో బీబర్‌ సహాయకుడు ఆ సూపర్ కార్‌ను గుర్తించాడు. కారు అదృశ్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ కెనడియన్‌ ర్యాపర్‌ తన ఫెరారీ కారును తెలుపు రంగును బ్లూకి మార్చాడు.

అంతేకాదు కారు స్టీరింగ్ వీల్ మీద గుర్రం సింబల్‌ రంగును, అల్లాయ్ వీల్స్, రిమ్స్ మీద బోల్ట్ లను మార్చాడు. దీంతో ఫెరారీ సంస్థ బీబర్‌పై గుర్రుగా ఉంది. దీనికితోడు రంగును మార్చి వేలం వేయడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన ఫెరారీ సంస్థ.. ఇకపై బీబర్‌ తమ సంస్థకు చెందిన కారును వినియోగించే ప్రసక‍్తి లేదని వార్నింగ్‌ ఇచ్చినట్లు నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.

చదవండి👉టాటా ఎలక్ట్రిక్‌ వెహికల్‌,లాంచ్‌ చేసిందో లేదో.. హాట్‌ కేకుల్లా బుకింగ్స్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top