
హైదరాబాద్: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జేఎల్‌ఆర్ ఇండియా హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా లగ్జరీ బొటిక్ ఆటోమోటివ్ షోరూమ్ లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రసిద్ధి చెందిన రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్లకు ప్రత్యేకమైన షోరూంను హైదరాబాద్‌లో ప్రారంభించిన జేఎల్‌ఆర్ ఇండియా సురేష్ రెడ్డి నేతృత్వంలోని ప్రైడ్ మోటార్స్ భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ షోరూం వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన, ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఇందులో లేటెస్ట్ వెహికల్ మోడల్స్, క్యూరేటెడ్ ఆప్షన్స్, లైఫ్ స్టైల్, బ్రాండెడ్ ఐటమ్స్ కోసం ఒక విభాగం ఉన్నాయి. కన్సల్టేటివ్, ఇమ్మర్సివ్ సేల్స్ విధానంతో క్లయింట్ లకు మార్గనిర్దేశం చేయడానికి నిపుణులైన సిబ్బంది అందుబాటులో ఉంటారు.
"దేశంలోని అత్యంత డిజైన్-ఫార్వర్డ్, ఆకాంక్షాత్మక నగరాలలో ఒకటైన దానిలో మా రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్ల గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నాము. ఈ షోరూం ఆధునిక, క్యూరేటెడ్ లగ్జరీ పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మా హౌస్ ఆఫ్ బ్రాండ్స్, కస్టమర్-ఫస్ట్ ప్రయాణంలో తదుపరి దశను సూచిస్తుంది" అని జేఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా పేర్కొన్నారు.