breaking news
JLR launch
-
రేంజ్ రోవర్, డిఫెండర్లకు హైదరాబాద్‌లో ప్రత్యేక షోరూం
హైదరాబాద్: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జేఎల్ఆర్ ఇండియా హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా లగ్జరీ బొటిక్ ఆటోమోటివ్ షోరూమ్ లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రసిద్ధి చెందిన రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్లకు ప్రత్యేకమైన షోరూంను హైదరాబాద్‌లో ప్రారంభించిన జేఎల్ఆర్ ఇండియా సురేష్ రెడ్డి నేతృత్వంలోని ప్రైడ్ మోటార్స్ భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ షోరూం వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన, ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఇందులో లేటెస్ట్ వెహికల్ మోడల్స్, క్యూరేటెడ్ ఆప్షన్స్, లైఫ్ స్టైల్, బ్రాండెడ్ ఐటమ్స్ కోసం ఒక విభాగం ఉన్నాయి. కన్సల్టేటివ్, ఇమ్మర్సివ్ సేల్స్ విధానంతో క్లయింట్ లకు మార్గనిర్దేశం చేయడానికి నిపుణులైన సిబ్బంది అందుబాటులో ఉంటారు."దేశంలోని అత్యంత డిజైన్-ఫార్వర్డ్, ఆకాంక్షాత్మక నగరాలలో ఒకటైన దానిలో మా రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్ల గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నాము. ఈ షోరూం ఆధునిక, క్యూరేటెడ్ లగ్జరీ పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మా హౌస్ ఆఫ్ బ్రాండ్స్, కస్టమర్-ఫస్ట్ ప్రయాణంలో తదుపరి దశను సూచిస్తుంది" అని జేఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా పేర్కొన్నారు. -
జేఎల్ఆర్ కొత్త కాంపాక్ట్ లగ్జరీ ఎస్యూవీ
దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) లేటెస్ట్ మోడల్ కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీని విడుదల చేసింది. డిజైన్, రూపకల్పన, నిర్మాణం మొత్తం పూర్తిగా లండన్ యూనిట్లో తయారు చేసినట్టు తెలిపింది. బేబీ రేంజ్‌రోవర్‌గా పిలుస్తున్న ఈ కొత్త ఎస్యూవీ హల్లో రేంజ్ రోవర్ ఎవోక్‌ని లండన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. టెక్నాలజీ విప్లవంగా అభివర్ణించిన కొత్త మోడల్ ధర 41వేల డాలర్ల (సుమారు 29లక్షల రూపాయలు) ధరకు లభిస్తుంది, వచ్చే ఏడాది రోడ్లపై రానుందని కంపెనీ వెల్లడించింది. బిలియన్ పౌండ్ల పెట్టుబడులతో, యుకె ఉత్పత్తిపట్ల తమ నిబద్ధత స్థిరంగా ఉందని జెఎల్ఆర్ సీఈవో రాల్ఫ్ స్పెత్ వెల్లడించారు. తమ నూతన వాహనం రేంజ్ రోవర్ ఎవోక్యూ ప్రీ ఆర్డర్లను ఈవారం ప్రారంభించినట్టు జేఎల్ఆర్ తెలిపింది. అమెరికా, యూకే, యూరప్ వినియోగదారులకు 2019 ప్రారంభంలో మొదటి డెలివరీ ఉంటుందని వెల్లడించింది 2020 నుండి, ప్రతి కొత్త జాగ్వార్, ల్యాండ్ రోవర్లలో ఎలెక్ట్రిక్ వెర్షన్లను ప్రారంభిస్తామని తెలిపింది. కాంపాక్ట్ లగ్జరీ ఎస్యూవీ సెగ్మెంట్లో మొదటిదైన రేంజ్ రోవర్ ఎవోక్ వాహనాలను 48-వోల్ట్ మిల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో ప్రారంభిస్తామని పేర్కొంది. -
రేంజ్ రోవర్ పెట్రోల్ వేరియంట్ లాంచ్...ధర ఎంత?
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ మేకర్ టాటా మోటార్స్ సొంతమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్ ) కొత్త ప్రీమియం కారును బుధవారం లాంచ్ చేసింది. తన ప్రీమియం ఎస్ యూవీ రేంజ్ రోవర్ ఎవోక్ పెట్రోల్ వేరియంట్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ 53,20 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించింది. 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 177 కెడబ్ల్యూ శక్తిని అందించే కొత్త పెట్రోల్ వేరియంట్ ఎవోక్. అయితే కంపెనీ ఇప్పటికే డిసెంబర్ 2016 నుంచి ఇండియాలో ఎస్ యూవీ వాహనాలను డీజిల్ వేరియంట్లలో విక్రయిస్తోంది. అద్భుతమైన వాహన డ్రైవింగ్ అనుభవాన్ని కాంక్షించే వినియోగదారులకు శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ను అందించడంలో తమ నిబద్ధతను మరింత పటిష్టం చేసుకున్నట్టు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ అధ్యక్షుడు రోహిత్ సూరి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా భారతదేశం లో ల్యాండ్ రోవర్ పోర్ట్‌ఫోలియోలో డిస్కవరీ స్పోర్ట్ రూ 47.59 లక్షల ప్రారంభ ధరగా ఉంది. రేంజ్ రోవర్ స్పోర్ట్ రూ 1.18 కోట్లు, ఫ్లాగ్షిప్ రేంజ్ రోవర్ రూ 2.13 కోట్లుగా ఉంది. రేంజ్ రోవర్ ఎవోక్ (పెట్రోల్) తో పాటు 49.10 లక్షల ప్రారంభ ధరగా (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.