
ఖరీదైన హార్డ్‌వేర్ అవసరం లేకుండా ఏ స్క్రీన్ నైనా పూర్తి స్థాయి కంప్యూటర్‌గా మార్చే గేమ్ ఛేంజింగ్ సర్వీస్‌ను రిలయన్స్ జియో ‘జియోపీసీ’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో ఫైబర్ లేదా జియోఎయిర్ ఫైబర్‌తో నడిచే క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్ టాప్‌ను జియోపీసీ అంటారు. దీనిద్వారా కేవలం కీబోర్డు, మౌస్ ఉపయోగించి టీవీ లేదా మానిటర్‌ను పర్సనల్ కంప్యూటర్‌గా మార్చుకోవచ్చు.
పూర్తిగా క్లౌడ్ మీద ఆధారపది ఇది కంప్యూటింగ్ సర్వీసు అందిస్తుంది. ఇందులో సీపీయూ ఉండదు. అప్‌గ్రేడ్‌లు ఉండవు. మెయింటెనెన్స్ ఉండదు. ఈ క్లౌడ్ సర్వీస్ కోసం నెలకు రూ.400 నుంచి ‘పే-యాస్ యూ-గో’ మోడల్ ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త యూజర్లకు ఒక నెల ఉచిత ట్రయల్ అందిస్తారు. 8 జీబీ ర్యామ్, 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్, ఏఐ ఆధారిత టూల్స్ ఇందులో ఉంటాయి. అడోబ్ ఎక్స్ ప్రెస్‌ను ఉచితంగా అందిస్తారు. ఇది ఫైల్ డిజైన్, ఎడిటింగ్‌కు ఉపయోగపడుతుంది.
లిబ్రే ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (బ్రౌజర్ కోసం), జియో వర్క్ స్పేస్ వంటి ఉత్పాదక అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. ఈ క్లౌడ్‌లో డేటాను సురక్షితంగా స్టోర్ చేసేందుకు వైరస్ అటాక్‌ల నుంచి భద్రత కల్పిస్తారు.
ఎవరికి ఉపయోగమంటే..
ఆన్‌లైన్ లెర్నింగ్, కోడింగ్, రీసెర్చ్ కోసం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ముందస్తు పెట్టుబడి లేకుండా సరసమైన కంప్యూటింగ్ కోసం చిరు వ్యాపారాలకు తోడ్పడుతుంది. కుటుంబ సభ్యుల కోసం వినోదాన్ని అందిస్తుంది. క్లౌడ్ టూల్స్‌తో కంటెంట్ క్రియేటర్లు డిజైన్, ఎడిట్, పబ్లిషింగ్‌ను ఉపయోగించవచ్చు.
ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’
ఎలా సెట్ చేయాలంటే..
జియో సెట్ టాప్ బాక్స్ ఆన్ చేయాలి.
యాప్స్ విభాగానికి వెళ్లి జియోపీసీ యాప్‌ను లాంచ్ చేయాలి.
కీబోర్డ్, మౌస్‌ను ప్లగ్ ఇన్ చేయాలి.
జియో నంబర్‌తో రిజిస్టర్ అయి, సైన్ ఇన్ అవ్వాలి.