జియో నుంచి కొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌.. రూ.399కే ఫ్యామిలీ ప్లాన్‌

Jio Unveils Postpaid Family Plans Jio Plus For Rs 399 And Rs 699 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెలికం రంగ సంస్థ రిలయన్స్‌ జియో కొత్త పోస్ట్‌పెయిడ్‌ ఫ్యామిలీ ప్లాన్స్‌ను పరిచయం చేసింది. కస్టమర్లు ఒక నెలపాటు ఉచితంగా ట్రయల్‌ చేయవచ్చు. ప్లాన్స్‌ రూ.399 నుంచి ప్రారంభం. అదనంగా మూడు సిమ్‌లను తీసుకోవచ్చు. ఒక్కొక్క సిమ్‌కు నెలకు రూ.99 చార్జీ చేస్తారు. అపరిమిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌ చేసుకోవచ్చు. రూ.399 ప్యాక్‌లో నలుగురు సభ్యుల కుటుంబానికి మొత్తం చార్జీ రూ.696 ఉంటుంది.

నలుగురు సభ్యులు ఒక నెలలో మొత్తం 75 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. రూ.699 ప్లాన్‌లో 100 జీబీ డేటా అందుకోవచ్చు. అలాగే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్, జియోటీవీ, జియో సినిమాస్‌ యాప్స్‌ను ఆస్వాదించవచ్చు.

ఇండివిడ్యువల్‌ ప్లాన్స్‌లో రూ.299 ప్యాక్‌కు 30 జీబీ, రూ.599 ప్యాక్‌ అయితే అపరిమిత డేటా ఆఫర్‌ చేస్తోంది. సెక్యూరిటీ డిపాజిట్‌ ప్లాన్‌నుబట్టి రూ.375–875 ఉంది. జియోఫైబర్, కార్పొరేట్‌ ఉద్యోగులు, జియోయేతర పోస్ట్‌పెయిడ్‌ యూజర్స్, క్రెడిట్‌ కార్డ్‌ కస్టమర్లు, మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నవారికి ఈ సెక్యూరిటీ డిపాజిట్‌ లేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top