Jio Prepaid Plans Offers: రిలయన్స్ జియో యూజర్లకు గుడ్‌న్యూస్!

Jio Prepaid Plans Offering Under Rs200 - Sakshi

గతేడాది నవంబర్‌లో దేశీయ టెలికాం కంపెనీలు రిలయన్స్‌ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్‌ ఐడియాలు బెన్‌ఫిట్స్‌ తగ్గించి టారిఫ్‌ ధరల్ని భారీగా పెంచాయి. పెరిగిన టారిఫ్‌ ధరలతో కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ ధరలు డబుల్‌ అయ్యాయి. దీంతో యూజర్లు తమకు లాభదాయకంగా ఉన్న టెలికాం కంపెనీల వైపు మొగ్గు చూపడంతో ఆయా కంపెనీల మధ్య పోటీ నెలకొంది. ఈ పోటీని తట్టుకునేందుకు జియో బంపరాఫర్‌ ప్రకటించింది. రూ.200ల లోపు ఉన్న టారిఫ్‌ ప్లాన్‌లకు ప్రతి రోజు 1జీబీ డేటాను అందిస్తుంది. 

ఈఏడాది చివరి నాటికి దేశంలో వెయ్యి నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 4జీ టారిఫ్‌ ధరల్ని పెంచి 5జీపై పెట్టుబడులు పెట్టింది. అయితే టారిఫ్‌ ధరలు పెరగడంతో జియో యూజర్లు కాస్తా ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను వినియోగించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జియో యూజర్లకు తక్కువ ధరలో  అదిరిపోయే ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఆ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రత్యేకంగా జియో యుజర్లకు 

రూ.149 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ కు ప్రతిరోజు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లను సెండ్‌ చేసుకోవచ్చు. 20రోజుల వ్యాలిడిటీతో జియో మూవీస్‌, జియో క్లౌడ్‌ సేవల్ని వినియోగించుకోవచ్చు. 

24రోజుల వ్యాలిడిటీతో రూ.179ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చిన జియో..ప్రతిరోజూ 1జీబీ డేటా,100ఎస్‌ఎంఎస్‌లు,అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. వ్యాలిడిటీని పెంచుకోవాలంటే అదనంగా రూ.149 రిఛార్జ్‌ చేసుకోవచ్చు. 

రూ.209తో రీఛార్జ్‌ చేసుకుంటే 28రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 100ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, జియో మువీస్‌, జియో క్లౌడ్‌తో పాటు మరిన్ని సేవల్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక 28రోజుల వ్యాలిడిటీతో వొడాఫోన్‌ ఐడియా రూ.269 వసూలు చేస్తుంది. బేసిక్‌ లెవల్స్‌లో బెన్‌ఫిట్స్‌ ఉన్నాయి 

రూ.119చెల్లిస్తే ప్రతిరోజు 1.5జీబీ డేటాతో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌,300 ఎస్‌ఎంఎస్‌లను పంపుకోవచ్చు. దీని వ్యాలిడిటీ 14రోజులు మాత్రమే. 

రూ.199కి రీఛార్జ్‌ చేసుకుంటే 23రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 1.5జీబీ డేటా,100ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ వాయిస్‌కాల్స్‌ మాట్లాడొచ్చు. 

చదవండి: రిలయన్స్ జియోకు దిమ్మతిరిగేలా షాక్..! దెబ్బ మామూలుగా లేదు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top