జియో ప్లాట్‌ఫామ్స్‌ @ రూ. 1,065–1,119  | Jio Platforms sets IPO price band at Rs 1,065-1,119 per share | Sakshi
Sakshi News home page

జియో ప్లాట్‌ఫామ్స్‌ @ రూ. 1,065–1,119 

Oct 10 2026 5:00 AM | Updated on Oct 10 2026 5:00 AM

Jio Platforms sets IPO price band at Rs 1,065-1,119 per share

ఈ నెల 21న పబ్లిక్‌ ఇష్యూ షురూ 

రూ. 30,200 కోట్ల సమీకరణకు సై 

మార్కెట్‌ వర్గాల తాజా అంచనాలు

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 1,065–1,119 ధరల శ్రేణి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ఈ నెల 21న ప్రారంభం కానున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేశాయి. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 19న షేర్లను కేటాయించనున్నట్లు పేర్కొన్నాయి. దీనిలో భాగంగా రిలయన్స్‌ గ్రూప్‌ డిజిటల్, టెలికం సేవల దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్‌ 27 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది.

 తద్వారా రూ. 30,200 కోట్లు సమీకరించే వీలున్నట్లు తెలియజేశాయి. వెరసి దేశీయంగా అతిపెద్ద ఐపీవోగా రికార్డ్‌ సృష్టించే అవకాశముంది. దీంతో కంపెనీ విలువ రూ. 10 లక్షల కోట్లకుపైగా చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 28కల్లా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌ కానున్నట్లు అభిప్రాయపడ్డారు. 

ఈ ఏడాది జూన్‌లో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయడం ద్వారా ఐపీవోకు ఆగస్ట్‌లో అనుమతి పొందిన సంగతి తెలిసిందే. కాగా.. తొలుత ఐపీవో ద్వారా రూ. 35,000 కోట్లు సమీకరించే వీలున్నట్లు అంచనాలు వెలువడగా.. కంపెనీ మార్కెట్‌ విలువను సైతం ఒక దశలో రూ. 13 లక్షల కోట్లకుపైగా అంచనా వేసిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement