ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎంకు మరో భారీ షాక్‌!.. ఇదే తొలిసారి

Jefferies drops rating on Paytm - Sakshi

ప్రముఖ ఫిన్‌ టెక్‌ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్‌ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేటీఎంకు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ కంపెనీ జెఫరీస్‌ రేటింగ్‌ను తగ్గించింది.పేటీఎం ఆదాయం ఏటేటా 28 శాతం క్షీణించిందని, ఇది 'తక్కువ పనితీరు' నుంచి 'నాట్ రేటింగ్'కు మారిందని జెఫరీస్ తెలిపింది. 

ఒకవేళ ఆర్‌బీఐ పేటీఎంపై చర్యలు తీసుకోకపోయినట్లైతే రెవెన్యూ ట్రాక్షన్, వ్యయ నియంత్రణల నుండి ఉత్పన్నమయ్యే సానుకూల, ప్రతికూలతల్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. అయితే పేటీఎంపై ఆర్‌బీఐ చర్యలు కొనసాగుతున్నట్లు వస్తున్న నివేదికల నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెఫరీస్‌ తన నోట్‌లో పేర్కొంది.   

రేటింగ్‌ ఎందుకు
కార్పొరేట్‌ రంగంలో ఆయా కంపెనీల తీరు ఎలా ఉంది? ఆర్ధికంగా సదరు సంస్థ సామర్ధ్యాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై ఇండిపెండెంట్‌ క్రెడింగ్‌ రేటింగ్‌ ఏజెన్సీలు రేటింగ్స్‌ ఇస్తుంటాయి. ఆ రేటింగ్స్‌ ఆధారంగా సంస్థల్లో పెట్టుబడులు, వినియోగదారుల్లో నమ్మకం ఉందని అర్ధం. అలా కాకుండా ఏ మాత్రం నెగిటీవ్‌ రేటింగ్‌ ఇస్తే సంబంధిత కంపెనీపై నమ్మకం సన్నగిల్లుతుంది.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top