ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్‌

IT Mall offers up to 40 pc festive discounts on laptops - Sakshi

ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ల్యాప్‌టాప్స్‌ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్థానంలో ఉన్న ఐటీ మాల్‌.. దీపావళి నేపథ్యంలో హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్, అవిటా బ్రాండ్ల ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది. అలాగే స్క్రాచ్‌ కార్డుపై రూ.2,500 నుంచి రూ.50,000 వరకు నగదు, ల్యాప్‌టాప్, మొబైల్స్‌ వంటి   బహుమతులు గెలుచుకోవచ్చు. రూ.5,000 వరకు విలువైన యాక్సెసరీస్‌ కూడా ఉచితంగా అందుకోవచ్చని ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్‌ తెలిపారు. పరిశ్రమలో తొలిసారిగా 70–80% కొత్త మోడళ్లు కొలువుదీరాయని చెప్పారు. కంపెనీలు 10 శాతం వరకు ధరలను తగ్గించడం వినియోగదార్లకు ప్రయోజనం అన్నారు. జీరో డౌన్‌ పేమెంట్, జీరో వడ్డీ ఆఫర్‌ చేస్తున్నామని చెప్పారు. ధరల శ్రేణి రూ.20,000లతో మొదలుకుని రూ.7 లక్షల వరకు ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top