వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీదారులకు శుభవార్త..!

IRDAI proposes lifelong renewability personal accident insurance - Sakshi

వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీదారులకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏఐ) గుడ్ న్యూస్ ను అందించింది. ఇకపై వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు జీవితాంతం వరకు కొనసాగించేలా నిబంధనలను తీసుకొచ్చేందుకు ఐఆర్‌డీఏఐ ముసాయిదాను విడుదల చేసింది.

పాలసీ పునరుద్ధరణకు ఓకే..!
ఆయా పాలసీ కంపెనీలు వయసును కారణంగా చూపించి వ్యక్తిగత బీమా పాలసీ పునరుద్ధరణకు నిరాకరించకూడదని ఐఆర్‌డీఏఐ ముసాయిదాలో పేర్కొంది. అంతేకాకుండా ఆరోగ్య బీమా పోర్టబులిటీకి నిర్ణీత సమయాన్ని కేటాయించాలని తెలిపింది. బీమా పోర్టబిలిటీ విషయంలో సదరు వ్యక్తికి ఉన్న  ఆరోగ్య బీమా పాలసీకి చెందిన బీమా సంస్థను మార్చుకోవాలనుకున్నప్పుడు, దీనికోసం దరఖాస్తు చేసిన ఐదు రోజుల్లోగా కొత్త బీమా సంస్థ, పాత సంస్థ నుంచి సమాచారం తెప్పించుకోవాలనే నిబంధనను కూడా ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించింది. దీంతో సదరు పాలసీదారుడికి కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది.పాలసీదారుడి రిస్క్‌ ప్రొఫైల్‌ మారినప్పుడు ప్రీమియంలో రాయితీలు కూడా ఇవ్వాలని కోరింది.

పూర్తి వివరాలతో...
ఐఆర్‌డీఏఐ ప్రతిపాదన మేరకు ఆయా పాలసీదారుడి ఆరోగ్య వివరాలు, అప్పటివరకు చేసిన క్లెయింలు అందులో ఉండనున్నాయి. ఇక పాలసీ పోర్టబిలిటీ నిర్దీత సమయంలోగా పూర్తయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని నియంత్రణ సంస్థ భావిస్తోంది. ప్రస్తుతానికైతే  దీనికి ఎలాంటి గడువులేదు. ఇక  పాలసీదారులు తమ పాలసీ మొత్తాన్ని 'పెంచుకోకుండా.. గత పాలసీనే కొనసాగిస్తే...ఎలాంటి వైద్య పరీక్షలు లేకుండా పాలసీ కొనసాగించేలా, కొత్తగా పాలసీ నిబంధనలు మార్చడంలాంటివి చేయొద్దనే నిబంధనలను ఐఆర్‌డీఏఐ తీసుకురానుంది. ఈ సూచనలపై తమ అభిప్రాయాలను వెల్లడించాలని   ఐఆర్‌డీఏఐ బీమా సంస్థలను కోరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top