ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ రుపే కార్డ్ :  ఆఫర్లు

IRCTC SBI Card on RuPay platform launched - Sakshi

సాక్షి, ముంబై : భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కార్డు వచ్చేసింది. భారతీయ రైల్వే ప్రయాణికులకు గరిష్ట లాభంతోపాటు,  రిటైల్, భోజన, వినోదాలపై ప్రయోజనాలు, ఇతర లావాదేవీల మినహాయింపుల అందించేలా ఐఆర్‌సీటీసీ ఎస్‌బిఐ కార్డును రుపే ప్లాట్‌ఫాంపై విడుదల చేశాయి.ఈ క్రెడిట్ కార్డు ద్వారా రైల్వేకు సంబంధించిన లావాదేవీలన్నీ డిజిటల్ గా సురక్షితంగా జరుగుతాయని  రైల్వే మంత్రి పియూష్ గోయల్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రయోజనాలు

  • నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సి)టెక్నాలజీ ద్వారా రైల్వేస్టేషన్లోని పీఓఎస్ మిషన్లలో కార్డును స్వైప్ చేయకుండానే కేవలం టచ్ ద్వారా సంబంధింత లావాదేవీలు పూర్తి చేయవచ్చు.  2021 మార్చి వరకు ఎలాంటి ఎంట్రీ  రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఐఆర్‌సీటీసీ బుక్ చేసే టికెట్లపై ఒక శాతం డిస్కౌంట్ అందిస్తుంది. కొత్త ఐఆర్‌సీటీసీ-ఎస్‌బీఐ రుపే క్రెడిట్ కార్డుతో, వినియోగదారులు టికెట్లు బుక్ చేసుకోవడంతోపాటు ఆన్‌లైన్ షాపింగ్, డిస్కౌంట్  కూడా పొందవచ్చు. రైలు టిక్కెట్ల కొనుగోలు ద్వారా వచ్చిన రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయవచ్చు. 
  • ముఖ్యంగా బిగ్‌బాస్కెట్, ఆక్స్‌వై, ఫుడ్‌ఫర్ ట్రావెల్.ఇన్, అజియో, మొదలైన వాటిలో షాపింగ్ చేసేటప్పుడు వినియోగదారులు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను పొందవచ్చు. మెడ్ లైఫ్ ద్వారా మెడిసిన్స్ పై 20 శాతం దాకా డిస్కౌంట్.
  • వినియోగదారులకు ఆల్‌రౌండ్ షాపింగ్ అనుభవాన్ని మరింతగా పొందేలా కార్లటన్, అరిస్టోక్రాట్, విఐపి, స్కైబ్యాగ్ , కాప్రీస్‌లలో షాపింగ్ చేసేటప్పుడు 10 శాతం తగ్గింపును అందిస్తోంది. మింత్రాలో 300 రూపాయలు ఆఫర్  క్యూమాత్‌పై 15 శాతం, బాటాపై 25 శాతం తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. 
  • వృత్తి, వ్యాపారరీత్యా తరచూ రైలు ప్రయాణం చేస్తున్న వారికి అదనపు  ప్రయోజనాలు లభిస్తాయి. ఎన్నో అత్యాధునిక సౌకర్యాలతో పాటు ఏసీ, సెకండ్, థర్డ్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ చైర్, ఏసీ కార్ చైర్ వినియోగదారులకు 10శాతం వాల్యూ బ్యాక్ సదుపాయం. ఒక శాతం ఇంధన సర్‌చార్జ్ మినహాయింపు లభిస్తుంది.  రైల్వే స్టేషన్లలో మూడు నెలలకు ఒకసారి  ఏడాదిలో నాలుగు సార్లు ప్రీమియం లాంజ్ ఉచితం. అలాగే  కార్డ్ హోల్డర్లు 350 బోనస్ రివార్డ్ పాయింట్లను అందుకుంటారు. 

ఈ కార్డు కోసం ఎలా దరఖాస్తు  చేయాలి
ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి పోర్టల్‌ను సందర్శించాలి. అక్కడ పొందుపర్చిన లింక్‌లో వ్యక్తిగత వివరాలు, మొబైల్ నంబర్, అడ్రస్ ప్రూఫ్  ఎంటర్ చేసి, దరఖాస్తు చేసుకోవాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top