గేమింగ్‌ ప్రియుల కోసం ఐక్యూ నుంచి కొత్త ఫోన్‌..! | iQoo Z5 Price in India Leaks Launch Tipped for September End | Sakshi
Sakshi News home page

iQoo Z5: గేమింగ్‌ ప్రియుల కోసం ఐక్యూ నుంచి కొత్త ఫోన్‌..!

Sep 19 2021 9:06 PM | Updated on Sep 19 2021 9:09 PM

iQoo Z5 Price in India Leaks Launch Tipped for September End - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వివో సబ్‌ బ్రాండ్‌ ఐక్యూ చైనా మార్కెట్లలోకి ఐక్యూ జెడ్‌5 స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్‌ 23న లాంచ్‌ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే భారత మార్కెట్లలోకి కూడా వస్తుందని తెలుస్తోంది. సెప్టెంబర్‌ చివరి నాటికి ఐక్యూ జెడ్‌5 భారత్‌లో ఆవిష్కరించే అవకాశం ఉందని జీఎస్‌ఎమ్‌ఎరీనా పేర్కొంది. రాబోయే ఐక్యూ జెడ్‌5 భారత మార్కెట్లలో సుమారు రూ. 30వేల లోపే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఐక్యూ జెడ్‌5 అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌తో గేమింగ్‌ ప్రియులకు సౌకర్యవంతంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఉంటుందని తెలుస్తోంది. 
(చదవండి: బ్లాక్‌బస్టర్‌ డీల్స్‌తో..అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌)

ఐక్యూ జెడ్‌5 ప్రో స్పెసిఫికేషన్‌లు

  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌, 120హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌
  • LPDDR5 ర్యామ్‌
  • 8జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 16ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
  • 64 ఎంపీ రియర్‌ కెమెరా
  • ఆండ్రాయిడ్‌ 11 సపోర్ట్‌
  • స్టీరియో స్పీకర్‌లు,
  • హై-రెస్ ఆడియో , హై-రెస్ ఆడియో వైర్‌లెస్ సపోర్ట్‌
  •  5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

చదవండి: ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న రియల్‌మీ జీటీ నియో 2 ఫీచర్స్

Advertisement
 
Advertisement
Advertisement